ఢిల్లీ, ముంబై సహా పలు మెట్రో నగరాల్లో ఈ సినిమా టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ. 2 వేలకు అమ్ముడవుతోంది.  ఈ నేపధ్యంలో చిత్రానికి కనుక టాక్ పాజిటివ్ గా వస్తే విధ్వంసమే అంటున్నారు.


ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా విడుదలకు ఇంకొద్ది గంటలే సమయం ఉంది. దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రంపై ఎక్సపెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. తొలి రోజు షోలన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. ఢిల్లీ, ముంబై సహా పలు మెట్రో నగరాల్లో ఈ సినిమా టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ. 2 వేలకు అమ్ముడవుతోంది. ఈ నేపధ్యంలో చిత్రానికి కనుక టాక్ పాజిటివ్ గా వస్తే విధ్వంసమే అంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ మేరకు జరిగింది..ఎంతొస్తే బ్రేక్ ఈవెన్ అనేది ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

 ప్రపంచ వ్యాప్తంగా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. 

నైజాం 50 కోట్లు
సీడెడ్ 17.5 కోట్లు
ఆంధ్రా 50 కోట్లు
తెలుగు రాష్ట్రాలు.. 121కోట్లు 

కర్ణాటక.. రూ. 16.50 కోట్లు.. 
తమిళనాడు .. రూ. 5 కోట్లు.. 
హిందీ మరియు ఓవర్సీస్.. రూ. 75 కోట్లు.. 
కేరళ.. రూ. 2 కోట్లు.. 
ఓవర్సీస్ తెలుగు.. 21.50 కోట్లు.. 

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 271 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. బాక్సాఫీస్ దగ్గర రూ. 272 కోట్ల షేర్ రాబట్టాలి. టాక్ బాగుంటే.. ఈ రేంజ్ కలెక్షన్స్ ఈజీగా దాటేయవచ్చు. 

ఇక ‘ఆదిపురుష్‌’ (Adipurush) టికెట్‌ ధరలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఈ మేరకు సింగిల్‌ స్క్రీన్‌, మల్టీప్లెక్సుల్లో టికెట్‌పై రూ.50 పెంచింది. సినిమా విడుదలైన నాటి నుంచి 10 రోజులపాటు ఇవే ధరలు కొనసాగనున్నాయి. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లో ప్రస్తుతం టికెట్‌ ధర రూ.115 ఉండగా, దీనికి అదనంగా రూ.50 చెల్లించాలి. అలాగే మల్టీప్లెక్స్‌లో రూ.177 ఉండగా.. దానిపై మరో రూ.50 చెల్లించాల్సి ఉంది. వీటితోపాటు 3డీ గ్లాసులకు ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సి ఉంది.

 అయితే, స్పెషల్‌ షోలకు మాత్రం అనుమతివ్వలేదు. ఇప్పటికే తెలంగాణలో ఈ సినిమాకు టికెట్‌ ధరలు పెంచిన విషయం తెలిసిందే. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో టికెట్‌పై రూ.50 పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే ఆరో షోకూ అనుమతించింది.