'ఆదిపురుష్' (తెలుగు) క్లోజింగ్ కలెక్షన్స్ , నష్టం ఎంతొచ్చిందంటే..
ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు వెర్షన్ కి కలిపి 190 కోట్ల రూపాయిలకు జరగగా, క్లోసింగ్ లో కేవలం 108 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. అంటే దాదాపుగా 50 శాతం నష్టాలు అన్నమాట.

ప్రభాస్ హీరో గా నటించిన ఆదిపురుష్ చిత్రం రీసెంట్ గా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మార్నింగ్ షో నుండే డివైడ్ టాక్ రావడం, దానికి తగ్గట్టుగా అనేక వివాదాల్లో ఈ సినిమా చిక్కుకోవడం వల్ల ఆడియన్స్ ని ఈ చిత్రం ఆకట్టుకోవడం లో విఫలం అయ్యింది. ఓపెనింగ్స్ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ తో ఓ రేంజిలో వచ్చాయి. అయితే మెల్లి మెల్లిగా డ్రాప్ అవుతూ . క్లోసింగ్ కలెక్షన్స్ తో బయ్యర్స్ కి కళ్లు తిరిగి పడిపోయేలా తీసేలా చేసింది. ఇంతకీ క్లోజింగ్ కలెక్షన్స్ తెలుగు వెర్షన్ కు ఎంత వచ్చాయి..ఎంత నష్టపోయారు విషయాలు చూస్తే..
ఏరియా షేర్
నైజాం ₹ 38.5 Cr
సీడెడ్ ₹ 10.8 Cr
ఉత్తరాంధ్ర ₹ 10.7 Cr
గుంటూరు ₹ 6.9 Cr
ఈస్ట్ గోదావరి ₹ 6.2 Cr
వెస్ట్ గోదావరి ₹ 5.1 Cr
కృష్ణా ₹ 4.9 Cr
నెల్లూరు ₹ 2.7 Cr
ఆంధ్రా/తెలంగాణా ₹ 85.8 Cr
భారత్ లో మిగతా ప్రాంతాలు (Approx) ₹ 11 Cr
ఓవర్ సీస్ ₹ 12.15 Cr
ప్రపంచ వ్యాప్తంగా ₹ 108.95 Cr
గమనిక: ఇది కేవలం తెలుగు వెర్షన్ కి సంబంధించిన డేటా మాత్రమే.
ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు వెర్షన్ కి కలిపి 190 కోట్ల రూపాయిలకు జరగగా, క్లోసింగ్ లో కేవలం 108 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. అంటే దాదాపుగా 50 శాతం నష్టాలు అన్నమాట.
'ఆదిపురుష్' కలెక్షన్స్ సంగతి పక్కనబెడితే... టీజర్ రిలీజైన దగ్గర నుంచి థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత గ్రాఫిక్స్ విషయంలో ఎంతలా ట్రోల్ చేశారో అందరికీ తెలిసిందే. ఇది కాదన్నట్లు పైరసీలో ఈ మూవీ లీక్ అయిపోయి మార్కెట్ దెబ్బ కొట్టింది. మరో 1-2 వారాల్లో 'ఆదిపురుష్' ఓటీటీలోకి వచ్చేయబోతున్నట్లు సమాచారం.