ప్రమోషన్స్ ను పరుగులు పెట్టాస్తున్నారు ఆదిపురుష్ టీమ్. భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న ఈసినిమా కోసం ప్రభాస్ అమెరికాలో పర్యటించబోతున్నట్టుసమాచారం.  

ఇప్పటికే అమెరికాకు చేరిపోయాడట ప్రభాస్. టీమ్ కూడా త్వరగా అక్కడకువెళ్ళేందుకు చూస్తున్నారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌత్ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్.రామాయణం ఆధారంగా ఈ మూవీ రూపోందించి. తాజాగా ఆదిపురుష్ నుంచి వచ్చే అప్ డేట్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. 

ఈక్రమంలో ఆదిపురుష్ టీమ్ నుంచి ఒక భారీ అప్ డేట్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ప్రమోషనల్ పోస్టర్స్ అండ్ వీడియోస్ మరింతగా ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై ఇవి అంచనాలు మరింతగా పెంచేస్తున్నాయి. ఇక ఈమూవీలో ప్రభాస్ రాముడిగా.. కృతి సీతగా అలరించబోతున్నారు. ఇక ఈ సినిమాలో రావణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఎాన్ నటించబోతున్నాడు.

సిరీస్ ఫిలిమ్స్, రిట్రో ఫైల్స్ సంస్థ ల పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది. దాంతో మూవీ రిలీజ్ వరకూ ఉన్న ఛాన్స్ లను వదులుకోకుండా..ప్రచారం చేయాలని టీమ్ ప్రయత్నిస్తోంది.అతి త్వరలో ఆదిపురుష్ ని యుఎస్ఏ లో కూడా గ్రాండ్ గా ప్రమోట్ చేయదల్చిందట . 

ఇక ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే ప్రభాస్ యూఎస్ఏ వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడి పలువురు ఫ్యాన్స్, ఆడియన్స్ తో ప్రభాస్ ఇంటరాక్ట్ అవనున్నారట. అయితే ఈ న్యూస్ పై ఆదిపురుష్ మేకర్స్ నుండి అఫీషియల్ గా రాలేదు. ఇక ఫారెన్ లో కూడా ఆయన ఫాలోయింగ్ అలా ఉంది మరి. ఇక ఈ విషయంలో అఫీషిమలం గా తెలియాల్సి ఉంది.