తెలుగు రాష్ట్రాల్లో 'ఆదిపురుష్' ఫైనల్ బిజినెస్(ఏరియావైజ్),బ్రేక్ ఈవెన్ టార్గెట్
రిలీజ్ కి ముందే ఫ్రీ రిలీజ్ బిజినెస్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ఆదిపురుష్ మూవీ ప్రభాస్ కి ఎలాంటి సక్సెస్ను అందిస్తుందో చూడాలి.
ప్రభాస్ ఇన్నేళ్ల సినీ కెరియర్ చూసుకుంటే ఆయన నటించిన సినిమాల్లో అతి పెద్ద ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమా ఆదిపురుష్ అని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాబట్టి ఓపెనింగ్స్ కూడా మామూలుగా ఉండవని, అదిరిపోవడం ఖాయమని అంటున్నారు. రిలీజ్ వీకెండ్ తర్వాత కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అదే సందడి నెలకొనాలి అంటే సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి పాజిటివ్ టాక్ రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో భారీ బిజినెస్ జరుగుతుంది. టాలీవుడ్ ఆగనిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు సుమారు రూ.185 కోట్లకు ఆది పురుష్ ప్రీ రిలీజ్ థియెట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు.
ఫైనల్ అయిన బిజినెస్ డిటేల్స్ ఇక్కడ చూద్దాం...
నైజాం - 50Cr NRA , 60Cr అడ్వాన్స్
ఆంధ్రా - 50Cr NRA, 60Cr అడ్వాన్స్
సీడెడ్ - 17.50 Cr NRA, 20Cr అడ్వాన్స్
AP/TS - 117.50 Cr NRA, 140Cr అడ్వాన్స్
P&P - 3.50 Cr
ఈ క్రమంలో ఈ సినిమా బయ్యర్లకు బ్రేక్ ఈవెన్ రావాలంటే 121 కోట్లు షేర్ (జీఎస్టీతో )కలిపి రావాల్సి ఉంది.
నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక రిలీజ్ కి ముందే ఫ్రీ రిలీజ్ బిజినెస్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ఆదిపురుష్ మూవీ ప్రభాస్ కి ఎలాంటి సక్సెస్ను అందిస్తుందో చూడాలి.
ఇక రామాయణం ఆధారంగా రాబోతున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించడంతో ఈ సినిమా ట్రైలర్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిన్న తిరుపతిలో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఇక ఆ ఈవెంట్ కి లక్షల్లో ప్రభాస్ అభిమానులు వచ్చారు.