Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ ‘ఆదిపురుష్‌’ లేటెస్ట్ అప్డేట్

ప్రస్తుతం ప్రభాస్‌ వరుస సినిమాలో బిజీగా ఉన్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ పూర్తైంది. దీని తర్వాత నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో ఓ పాన్‌ వరల్డ్‌ మూవీ చేస్తున్నారు. ఇందులో దీపిక పదుకొణె హీరోయిన్. ఈ రెండు చిత్రాల తర్వాత ‘ఆది పురుష్‌’ ఉంటుంది.

Prabhas Adipurush  completed 30 percent of the shoot  jsp
Author
Mumbai, First Published Jul 29, 2021, 7:17 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ప్రధానపాత్రలో పాన్‌ఇండియా చిత్రంగా ‘ఆదిపురుష్‌’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ‘తానాజీ’ వంటి చారిత్రాత్మక నేపథ్యం కలిగిన సినిమాను తెరకెక్కించిన బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 3డీలో తెరకెక్కబోయే ఈ పౌరాణిక చిత్రంలో ప్రభాస్‌ శ్రీరామునిగా, సైఫ్‌ అలీఖాన్‌ రావణబ్రహ్మగా, సీత‌గా కృతి సనన్ కనిపించబోతున్నారు. ఈ చిత్రం అప్డేట్స్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ లేకుండానే షూటింగ్ జరుగుతోంది. అందుతున్న సమాచారం మేరకు  ఈ సినిమా 30 శాతం పూర్తి చేసుకుంది. రీసెంట్ గా కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్ లో సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్ పాల్గొనబోతున్నారు. ప్రభాస్ వచ్చే నెల నుంచి షూట్ లో పాల్గొంటారు.  ముంబై మొహబూబ్ స్టూడియోస్ లో ఆదిపురుష్ కోసం క్రోమా సెట్స్ వేసారు. ఈ సినిమాలో విఎఫ్ ఎక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కీ సీక్వెన్స్ లు గ్రాఫిక్స్ లో ఉంటాయి. 

ఇక రీసెంట్ గా ప్రభాస్‌ ‘రాథేశ్యామ్‌’సినిమా లాస్ట్ షెడ్యుల్ షూట్ ని ఫినిష్ చేసారు. నాగ్ అశ్విన్ ..ప్రాజెక్టు కే మీద పని చేస్తున్నారు.  మరో ప్రక్క ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ దర్శకుడు ప్రశాంత్‌నీల్‌తో కలిసి‘సలార్‌’ని పట్టాలెక్కించారు. ఆ షూట్ లో కొద్ది రోజులు పాల్గొన్నారు.
 
 ఇక ‘తానాజీ’వంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాను తెరకెక్కించారు దర్శకుడు ఓంరౌత్‌. ఇప్పుడు బాహుబలి ప్రభాస్‌తో రామాయణం వంటి పౌరాణిక చిత్రాన్ని చేయనుండడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రెట్రోపిల్స్‌, టి-సిరీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఆదిపురుష్‌’ను ఆగస్టు 11, 2022న  ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో సినిమా రూపొందుతోంది.

‘‘ప్రభాస్‌ మాత్రమే ఈ పాత్రకు సరిపోతాడని నాకు అనిపించింది. ఆయన పర్సనాలిటీ, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటం, లోతైన చూపు, నిలబడే విధానం, నడిచే తీరు ఇలా ప్రభాస్‌లో ‘ఆది పురుష్‌’ పాత్రను నేను చూశా. ఒక వేళ ప్రభాస్‌ కాకపోయి ఉంటే ఈ సినిమా చేసేవాడిని కాదు’’ అని ఓం రౌత్‌ చెప్పుకొచ్చారు. ‘ఆది పురుష్‌’లో రాముడిని జీవితాన్ని ఎలా చూపించబోతున్నారు’ అని అడగ్గా.. ఇప్పుడే ఆ విషయాలు మాట్లాడటం తొందరపాటు అవుతుందని, ప్రస్తుతం తమ బృందం కథను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు తీవ్రంగా కష్టపడుతోందన్నారు.

‘‘ఇది ప్రభు రామ్‌ కథ. ఇతిహాసగాథలో ఒక భాగం. నా ఆలోచనలకు అనుగుణంగా తీర్చిదిద్దుకున్నా. ప్రస్తుతం వివిధ రకాలుగా సన్నద్ధమవుతున్నాం. సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. చారిత్రక కోణం నుంచి ఇప్పటికే దీనిపై పరిశోధన పూర్తి చేశాం. అందుకు సంబంధించిన నోట్స్‌ను సైతం సిద్ధం చేశాం. టెక్నాలజీ దృష్టి కోణం నుంచి చూస్తే, ఎంతో పరిశోధన, ప్రామాణికత అవసరం. రకరకాల స్టోరీబోర్డ్‌లు, సెట్స్‌, పాత్రల చిత్రీకరణ ఇలా అనేక వాటిని పరిగణనలోకి తీసుకోవాలి’’ అని ఓంరౌత్‌ చెప్పుకొచ్చారు.

‘‘తానాజీ’ సెట్స్‌పైకి వెళ్లక ముందు నుంచే నా మదిలో ‘ఆది పురుష్‌’ గురించి ఆలోచన ఉంది. చాలా పరిశోధనలు చేసి, ఒక రఫ్‌ డ్రాఫ్ట్‌ తయారు చేసుకున్నా. నా టీమ్‌కు కథ చెప్పిన తర్వాత వాళ్లు చాలా ఉత్సుకతకు లోనయ్యారు. మొదటి రెండు నెలలు ఆ రఫ్‌ డ్రాఫ్ట్‌ను పూర్తిగా తిరగరాశాం. స్క్రీన్‌ప్లేను అప్‌డేట్‌ చేశాం. కథావస్తువులో మార్పులు లేనప్పటికీ దాన్ని తీర్చిదిద్దే విధానం మాత్రం కొత్తగా ఉంటుంది. నేటి వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతుంది. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత నేను ప్రభాస్‌ను కలిసి కథ వినిపించా’’ అని ఓం రౌత్‌ అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios