రామాయణం కథను దర్శకుడు ఓమ్ రౌత్ 'ఆదిపురుష్' గా తెరపై ఆవిష్కరించాడు. ప్రభాస్  హీరోగా ఈ సినిమా రూపొందింది. శ్రీరాముడిగా ప్రభాస్ .. సీతాదేవిగా కృతి సనన్ .. హనుమంతుడిగా దేవ్ దత్త .. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో..


భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో దిగాడు ‘ఆదిపురుష్’. రిలీజ్ రోజు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా శ్రీరామ భక్తులు, ప్రభాస్ అభిమానుల కోలాహలమే కనబడింది. అయితే మొదటి రోజు మార్నింగ్ షోకు డివైడ్ టాక్ రావటంతో కొంత కనపడని నష్టం జరిగింది. ఎక్కడ చూసినా సినిమా పై విమర్శలే. రైటర్, డైరక్టర్ సంజాయిషీ ఇచ్చుకునే పనిలో ఉన్నారు. నార్త్ లో చాలా చోట్లు ఈ వీకెండ్ ముందే బుక్ చేసుకున్న టిక్కెట్ల జనంతో జై శ్రీరామ్ నినాదాలతో సినిమా హాళ్లు మార్మోగిపోయాయి. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం ఎక్కడా డ్రాప్ కాకపోవటం ఆనందం కలిగిస్తోంది.

ఏరియా షేర్ గ్రాస్

నైజాం ₹ 29.8 Cr ₹ --
సీడెడ్ ₹ 7.65 Cr ₹ --
ఉత్తరాంధ్ర ₹ 8.28 Cr ₹ --
గుంటూరు ₹ 5.9 Cr ₹ --
ఈస్ట్ గోదావరి ₹ 4.75 Cr ₹ --
వెస్ట్ గోదావరి ₹ 3.37 Cr ₹ --
కృష్ణా ₹ 3.5 Cr ₹ --
నెల్లూరు ₹ 1.8 Cr ₹ --
ఆంధ్ర/ తెలంగాణా ₹ 65.02 Cr ₹ --
రెస్టాఫ్ ఇండియా (Approx) ₹ 9.7 Cr ₹ --
ఓవర్ సీస్ ₹ 11.5 Cr ₹ --
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ₹ 85.22 Cr ₹ --


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్ట్రాల 'ఆదిపురుష్' థియేట్రికల్ హక్కులను రూ. 170 కోట్లకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తీసుకుందని తెలిసింది. లెక్కలను బట్టి ఈ చిత్రానికి - 44% రికవరీ అయ్యినట్లు. 

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొన్న శుక్రవారం థియేటర్లకు వచ్చింది. వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 7 వేల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, తొలిరోజున 140 కోట్లను వసూలు చేసింది. రెండో రోజు వంద కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రానికి 240 కోట్లు రెండు రోజుల్లో వసూలు అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా కొన్ని బాలీవుడ్ సినిమాల రికార్డులను అధిగమించింది. ఈ రోజు ఆదివారంతో ఈ సినిమా 300 కోట్ల మార్కును దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.

ఇక రామాయణం కథను దర్శకుడు ఓమ్ రౌత్ 'ఆదిపురుష్' గా తెరపై ఆవిష్కరించాడు. ప్రభాస్ హీరోగా ఈ సినిమా రూపొందింది. శ్రీరాముడిగా ప్రభాస్ .. సీతాదేవిగా కృతి సనన్ .. హనుమంతుడిగా దేవ్ దత్త .. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. 'ఆదిపురుష్' సినిమాను రెట్రో ఫైల్స్ సమర్పణలో టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మించారు. సుమారు రూ.550 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ ప్రతిష్టాత్మక చిత్రం రూపొందింది. తెలుగుతో పాటూ హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుంది.