బాహుబలి కంటే అంతకు మించి అన్నట్లుగా తెరకెక్కిన సాహో సినిమా వెండి తెరపై ఎలా ఉంటుందా అని ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. మెయిన్ గా సినిమా యాక్షన్ సీక్వెన్స్ కోసం అభిమానులు చాలా ఇంట్రెస్టింగ్ ఎదురుచూస్తున్నారు. చిత్ర యూనిట్ కూడా అభిమానులను యాక్షన్ సీన్స్ తప్పకుండా ఆకట్టుకుంటాయని సరికొత్త థ్రిల్ ని ఇస్తాయని చెబుతున్నారు. 

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ సినిమా యాక్షన్ సీన్స్ కి సంబందించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ చెప్పాడు.  ప్రీ క్లయిమ్యాక్స్ సినిమాలోనే హైలెట్ గా ఉండాలని దర్శకుడు నిర్మాతలు కలిసి చాలా రోజులు హోమ్ వర్క్ చేశారని అందుకోసం కేవలం ప్రీ క్లయిమ్యాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కోసం 80కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు చెప్పాడు. 

ఆ ఎపిసోడ్ మొత్తం ఆడియెన్స్ కి సరికొత్త కిక్ ఇస్తుందని నిర్మాత దర్శకుడు స్టంట్ మాస్టర్స్ చాలా కష్టపడినట్లు ప్రభాస్ చెప్పారు. ఇక సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. ప్రస్తుతం రిలీజ్ పనుల్లో బిజీగా ఉంటూనే ప్రమోషన్స్ లో కూడా రోజు పాల్గొంటున్నారు.