సాహో సినిమా రిలీజ్ తరువాత ఏ రేంజ్ లో రికార్డులు బద్దలవుతాయో గాని ప్రభాస్ ఇస్తున్న ఇంటర్వ్యూలు మాత్రం ఇంటర్నెట్ లో బాగానే వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ప్రభాస్ పెళ్లిపై వస్తోన్న రూమర్స్ గురించి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. అలాగే లవ్ కనెక్షన్స్ పై ఓ ట్విస్ట్ ఇచ్చి కన్ఫ్యూజన్ లో పెట్టాడు. 

ఆ విషయానికి వస్తే.. రీసెంట్ గా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు గర్ల్ ఫ్రెండ్ ఉండవచ్చు లేకపోవచ్చు అని రెండు విధాలా ఆన్సర్ వదిలి ఆడియెన్స్ లో కన్ఫ్యూజన్ నెలకొల్పాడు. ఇక ఎన్నారై సంబంధం చూసినట్లు ప్రభాస్ అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకోబవుతున్నట్లు గత కొంత కాలం నుంచి అనేక రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 

ఆ రూమర్స్ అంతా అబద్దమని చెబుతూ అనుష్క తో కూడా డేటింగ్ లో ఉన్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని కొట్టి పారేశారు. ప్రస్తుతం రిలేషన్ షిప్ గురించి అయితే ప్రభాస్  క్లారిటీ ఇవ్వలేదు. బహుశా ప్రభాస్ లవ్ లో ఉన్నాడేమో అని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. మరి దానిపై ప్రభాస్ భవిష్యత్ లో ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇక సాహో సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గా తెలుగు హిందీ తమిళ్ మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతోంది.  

బాహుబలి తరువాత సాహోలో మార్పులు చేశాం : ప్రభాస్ 

ప్రభాస్ తో రొమాన్స్ - యాక్షన్.. ఫుల్ ఎంజాయ్ చేశా: శ్రద్దా కపూర్