ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ మీడియా మొత్తం ప్రభాస్ చుట్టూ తిరుగుతోంది. సాహో చిత్రం విడుదల సందర్భంగా పలు మీడియా సంస్థలకు ప్రభాస్ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాయి. భారీ చిత్రం కావడంతో ప్రభాస్ కూడా ఓపిగ్గా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాడు. 

ప్రతి ఇంటర్వ్యూలో ప్రభాస్, అనుష్క రిలేషన్ గురించి ప్రశ్నకు ఎదురవుతున్నాయి. ప్రభాస్ చాలా కూల్ గా రూమర్లని ఖండిస్తున్నాడు. తాజాగా ఓయ్ ఇంటర్వ్యూలో అనుష్క నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు అని కామెంట్ చేశాడు. తనతో రెండు చిత్రాల్లో నటించిన కాజల్ గురించి ప్రభాస్ కు ప్రశ్న ఎదురైంది. కాజల్ లో పాజిటివ్, నెగిటివ్ పాయింట్స్ ఏంటని అడగగా ప్రభాస్ సమాధానం ఇచ్చాడు. అందం, ఎనర్జిటిక్ గా ఉండడం కాజల్ ప్లస్ పాయింట్స్. ఒకప్పుడు కాజల్ డ్రెస్సింగ్ చాలా యావరేజ్ గా ఉండేది అదే నెగిటివ్ అని ప్రభాస్ తెలిపాడు. 

ఇక అనుష్క గురించి చెబుతూ.. లేడీ సూపర్ స్టార్, చాలా టాల్.. నెగిటివ్ విషయానికి వస్తే ఫోన్లు త్వరగా లిఫ్ట్ చేయదు.. నేను చేసినా లిఫ్ట్ చేయదు అని ప్రభాస్ తెలిపాడు. ఇక తన వ్యక్తిగత విషయాల గురించి మీడియా పదే పడే ప్రశ్నకు అడిగినా నాకు విసుగు రాదని ప్రభాస్ తెలిపాడు. ఒక సెలెబ్రిటీ గురించి తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. అది సహజమే అని ప్రభాస్ తెలిపాడు.