రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి లాంటి పెద్ద సినిమా తరువాత అంతకంటే ఎక్కువ రేంజ్ లో సాహో సినిమాతో రాబోతున్నాడు. విరామం లేకుండా రెగ్యులర్ ప్రమోషన్స్ లో పాల్గొంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఫెయిల్యూర్స్ పై ప్రభాస్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. 

ప్రభాస్ మాట్లాడుతూ.. ఫెయిల్యూర్స్ అనేవి ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి. పెద్ద సినిమాలు చేసేటప్పుడు కూడా చాలా భయం ఉంటుంది. జాగ్రతగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలి. రెండేళ్లు నేను ఈ సినిమా కోసం పనిచేశాను. అదే చిన్న సినిమాలు ఒప్పుకొని ఉంటే నాలుగు ప్రాజెక్టులు పూర్తి చేసి ఎక్కువ డబ్బులు సంపాదించుకునేవాన్ని. కానీ ఓటమి భయం అప్పుడు ఎక్కువగా ఉంటుంది. 

ఎంతో మంది సినిమా కష్టపడతారు. అలాగే పెద్ద సినిమాలకు ఇంకా ఎక్కువ మంది పనిచేస్తారు. ఖచ్చితంగా ఆ భయం అనేది ఎప్పుడైనా ఉంటుంది. ఓటమి భయం నాలో కూడా ఉంది అని' ప్రభాస్ వివరణ ఇచ్చాడు. ఇక సాహో సినిమా ఈ నెల 30న తెలుగు తమిళ్ హిందీ మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది.