Asianet News TeluguAsianet News Telugu

మూడు సినిమాలు వెయ్యి కోట్లు...ఎవరికీ అందనంత ఎత్తులో ప్రభాస్..!

వరుసగా భారీ చిత్రాలు ప్రకటిస్తున్న ప్రభాస్ ఇండియాలోనే ఏ స్టార్ కి అందనంత ఎత్తులో ఉన్నారు. ప్రభాస్ నుండి రానున్న రాధే శ్యామ్, ప్రభాస్ 21 మరియు ఆదిపురుష్ చిత్రాల బడ్జెట్ కలిపితే దాదాపు 100కోట్లకు చేరింది. ఇది బాలీవుడ్ స్టార్ కూడా అందని అరుదైన ఫీట్ అనుకోవాలి. 
 

prabhas 3 movies budget exceeds 1000 crores
Author
Hyderabad, First Published Aug 21, 2020, 7:55 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

దేశంలోని ఏ స్టార్ హీరో అయినా ప్రభాస్ సినిమాల లైన్ అప్ చూస్తే కుళ్ళుకోవాల్సిందే. బాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన సల్మాన్, అమీర్ ఖాన్, అక్షయ్,హృతిక్ రోషన్ వంటి హీరోలు కూడా ప్రభాస్ వలె వందల కోట్ల బడ్జెట్ చిత్రాలలో నటించడం లేదు. నిజానికి వారికి మించిన మార్కెట్ ప్రభాస్ కి ఉందని ఇప్పుడు దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రం అంటే గుర్తొస్తున్న పేరు ప్రభాస్. సౌత్ అండ్ నార్త్ లో కూడా మార్కెట్ ఏర్పాటు చేసుకున్న ప్రభాస్ కి తిరుగులేదని నిర్మాతలు భావిస్తున్నారు. 

దర్శకుడు నాగ్ అశ్విన్ సైతం ఇదే చెప్పారు. వందల కోట్ల వసూళ్లు కేవలం ప్రభాస్ వలన సాధ్యం అందుకే నా సబ్జెక్టు కి ప్రభాస్ ని ఎంచుకున్నాను అన్నారు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న రాధే శ్యామ్ బుడ్జెట్ 200కోట్ల వరకు ఉంది. ఇక నాగ్ అశ్విన్ తో చేస్తుం సైన్స్ ఫిక్షన్ మూవీ, దర్శకుడు ఓం రౌత్ తో చేస్తున్న మైథలాజికల్ చిత్రాల బడ్జెట్ కలిపితే దాదాపు 800కోట్లు. మొత్తంగా ప్రభాస్ నుండి రానున్న ఈ మూడు చిత్రాల బుడ్జెట్ 1000 కోట్ల రూపాయలన్న మాట. ప్రభాస్ చేయనున్న రాధే శ్యామ్, ప్రభాస్ 21 మరియు ఆదిపురుష్ చిత్రాలతో ఆయన అతిపెద్ద మార్కెట్ కలిగిన హీరోగా ఎదగనున్నారు. 

బాహుబలి చిత్రం వరకు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఉన్న ప్రభాస్ ఏకంగా దేశంలోనే అత్యధిక బడ్జెట్ చిత్రాల హీరోగా ఎదిగారు. బాహుబలి విజయం రాజమౌళి ఖాతాలో వేసిన చాలా మంది ప్రభాస్ బాలీవుడ్ లో రాణించడం కష్టమే అన్నారు. కానీ సాహో విజయంతో ప్రభాస్ కి బాలీవుడ్ లో భారీ ఇమేజ్ ఉందని ప్రూవ్ అయ్యింది. సౌత్ నుండి ఒక్క రజిని కాంత్ మాత్రమే వందల కోట్ల బడ్జెట్ చిత్రాలు రెండు చేయడం జరిగింది. వరుసగా మూడు   భారీ   చిత్రాలలో నటిస్తూ  ప్రభాస్ ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లారు. 

Follow Us:
Download App:
  • android
  • ios