Asianet News TeluguAsianet News Telugu

మోహన్‌బాబు అమ్మనా బూతులు తిట్టారు.. మంచు లక్ష్మీ, విష్ణులను ఎత్తుకుని తిరిగా.. బోరున విలపించిన బెనర్జీ

 ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు మంగళవారం సాయంత్రం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు రాజీనామా ప్రకటించారు. ఈ సందర్భంగా బెనర్జీ మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

mohanbabu scolded in maa voting center says benarjee emotional
Author
Hyderabad, First Published Oct 12, 2021, 5:35 PM IST

నటుడు బెనర్జీ కన్నీళ్లు పెట్టుకున్నారు. మోహన్‌బాబు తనని కొట్టబోయారని, బండ బూతులు తిట్టారని చెబుతూ ఆయన ఎమోషనల్‌ అయ్యారు. ప్రెస్‌మీట్‌లో బోరున విలపించారు. `మా` ఎన్నికలు రెండు రోజుల క్రితం ముగిసిన విషయం తెలిసిందే. మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిచారు. ప్రకాష్‌రాజ్‌ ఓడిపోయారు. కానీ విష్ణు ప్యానెల్‌ నుంచి 15 మంది, ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ నుంచి 11 మంది గెలిచారు. అందులో వైస్‌ ప్రెసిడెంట్ గా బెనర్జీగా గెలుపొందిన విషయం తెలిసిందే.

తాజాగా ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు మంగళవారం సాయంత్రం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు రాజీనామా ప్రకటించారు. ఈ సందర్భంగా బెనర్జీ మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.  పోలింగ్‌ బూత్‌ వద్ద గొడవలు వద్దు నాన్న అని మంచు విష్ణు వద్దకి వెళితే  మోహన్‌బాబు తనని కొట్టబోయారని, బండ బూతులు తిట్టారని, అరగంట సేపు కంటిన్యూగా తిడుతూనే ఉన్నారని తెలిపారు. ఈ విషయాలు వెల్లడిస్తూ బెనర్జీ బోరున విలపించారు.

మోహన్‌బాబు పెళ్లికి ముందు తెలుసని, వాళ్లింట్లో ఉండేవాళ్లమని, మంచు లక్ష్మీ,విష్ణులను ఎత్తుకుని తిరిగానని, ఎంతో అనుబంధం ఉందని, కానీ  ఓటింగ్‌ రోజు మోహన్‌బాబు అలా తిట్టడం చాలా బాధగా అనిపించిందని, మూడు రోజులుగా మనసు చాలా బాధగా ఉందని తెలిపారు. ఓటింగ్‌ బూత్‌ వద్ద ఎన్నికల అధికారులు కూడా ఉన్నారు, కానీ ఈ విషయంలో వాళ్లు స్పందించలేదు, మోహన్‌బాబుని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. మోహన్‌బాబు అలానే అమ్మనా బూతులు తిడుతూనే ఉన్నారని తెలిపారు.

also read: దాసరి స్థానం మోహన్‌బాబు భర్తీ చేయాలన్న నరేష్‌..తన వల్ల కాదన్నా కలెక్షన్‌ కింగ్‌.. చిరుకి చెక్ పెట్టబోతున్నారా?

ఇలాంటి పరిస్థితుల్లో తాము సభ్యులుగా `మా`లో కొనసాగలేమన్నారు బెనర్జీ. రాజీనామా చేస్తేనే తన మనసులో ఉన్న భారం తగ్గిపోతుందని తెలిపారు. గత `మా` కమిటీలో తాను ఉన్నానని, అక్కడ జరగబోయే గొడవలు భరించలేమన్నారు బెనర్జీ. అయితే ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని కదిలించింది. భావోద్వేగానికి గురి చేసింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios