Asianet News TeluguAsianet News Telugu

రజని అభిమానులకు ‘రెబెల్ ’భయం, ఏం జరుగుతుందో ఏంటో

ఈ హైప్ జనాలను థియేటర్ కు తీసుకువస్తుందా లేక రెబల్ సినిమా మాదిరిగా అవుతుందా అని చాలా మంది డిస్కషన్స్ మొదలెట్టారు.  

Prabahs Rebel movie fear to Rajnikanth Baba re-release
Author
First Published Dec 3, 2022, 10:49 AM IST


డిసెంబర్ 12న రజనీ కాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన ‘బాబా’ సినిమాను ప్రపంచవ్యాప్త  రిలీజ్ కాబోతోంది. అయితే రీరిలీజ్ అంటే  కేవలం అప్పటి ప్రింట్ ని ఇప్పుడు టెక్నాలిజీ ప్రకారం మార్చి రిలీజ్ చేయటం కాకుండా  సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం స్పెషల్‌గా రజినీ కాంత్ మళ్లీ ఈ సినిమాలో డబ్బింగ్ కూడా చెబుతున్నారు. అలాగే మూవీలో కొన్ని కొన్ని సన్నివేశాలను యాడ్ చేస్తున్నారు అలాగే కొన్ని బోర్ కొట్టే సీన్స్ ను  తీసేశారని తెలుస్తోంది. 

బ్యాగ్రౌండ్ స్కోర్ లో కూడా మార్పులు చేయడానికి సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ను కూడా సంప్రదించిందట మూవీ టీమ్. ఈ జనరేషన్ కు తగినట్లు  మార్పులు చేర్పులతో ఇప్పటికే ఆ పనులన్నీ పూర్తయినట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలో తెలుగు వెర్షన్ సైతం రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు., మొత్తానికి ఒకప్పటి ఆడియన్స్ రిజెక్ట్ చేసిన సినిమాలకు ఇప్పుడీ రేంజ్ లో హైప్ రావడం మాత్రం విశేషమే. అయితే ఈ హైప్ జనాలను థియేటర్ కు తీసుకువస్తుందా లేక రెబల్ సినిమా మాదిరిగా అవుతుందా అని చాలా మంది డిస్కషన్స్ మొదలెట్టారు.  రెబెల్ కు సోషల్ మీడియాలో హడావిడి చేశారు కానీ తీరా చూస్తే జనం పెద్దగా రాలేదు. ఇలాంటి పరిస్దితి రిపీట్ కాకూడదని రజనీ అభిమానులు కోరుకుంటున్నారు.

‘బాబా’ సినిమా 2002 లో విడుదల అయింది. సూపర్ హిట్ చిత్రం  ‘నరసింహ’ తర్వాత రజనీ మూడేళ్ళు గ్యాప్ ఇచ్చి చేసిన సినిమా ఇది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ  ఎక్సపెక్టే,షన్స్ మధ్య విడుదల అయింది. అప్పట్లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు. మనీషా కొయిరాల హీరోయిన్ గా చేసిన ఈ సినిమా ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజనీ కాంత్ ఈ సినిమాలో హీరోగానే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, నిర్మాతగా వ్యవహరించారు. సినిమా విడుదల తర్వాత పూర్తి నెగిటివ్ టాక్ రావడంతో డిజాస్టర్ గా మిగిలిపోయింది. 

ఇక ‘బాబా’ సినిమా వచ్చి దాదాపు 20 ఏళ్ళు పూర్తయింది.  ఎవరమేని అన్నా..సినిమా డిజాస్టర్ అయినా ఇందులో రజనీ డైలాగ్స్, పాటలను అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఇప్పటికే ఈ సినిమా కొత్త వెర్షన్ ను ఇప్పటి ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దారట. ‘బాబా’ రి రిలీజ్ ను బ్రహ్మాండంగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు అభిమానులు. అయితే ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ను సామాజిక కార్యక్రమాల కోసం ఉపయోగించాలనే ఆలోచనలో ఉన్నారట రజనీ ఫ్యాన్స్.  

Follow Us:
Download App:
  • android
  • ios