డైనమిక్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోతున్న చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’. కాగా, తాజాగా దర్శకుడు హరీశ్ శంకర్ ఈ మూవీలోని పవర్ ఫుల్ డైలాగ్ ను లీక్ చేశారు.
గబ్బర్ సింగ్ లాంటి మాస్ కంటెంట్ సినిమా తర్వాత డైనమిక్ డైరెక్టర్ హరీశ్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) కాంబినేషనల్ లో రాబోతున్న చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’ (Bhavadeeyudu Bhagat singh). ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తి కావచ్చాయి. త్వరలోనే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం లాంగ్ షెడ్యూల్ షూటింగ్ ను శరవేగంగా ఫూర్తిచేస్తున్నారు.
అయితే, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’ రెండు రోజుల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తోంది. మరోవైపు ఇంటర్వ్యూలతో సినిమా రీచ్ ను పెంచేస్తున్నార. తాజాగా దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ‘ఆచార్య’ స్టార్ కాస్ట్ తో ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు అంశాలపై ప్రశ్నిలు సంధించార. అయితే తొందరపాటులో తన రాబోయే చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’లోని పవర్ ఫుల్ డైలాగ్ ను లీక్ చేశాడు.
కెమెరాలు ఉన్న సంగతే మరిచిపోయిన హరీశ్ శంకర్ డైలాగ్ ను లీక్ చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ డైలాగ్ గురించి మాట్లాడుతూ.. హీరో నడుచుకుంటూ వస్తుంటే వెనకాల చాలా మంది వస్తుంటారు. ఈ సందర్భంగా వచ్చే డైలాగ్ ఇలా ఉంటుందని తెలిపారు. ‘మొన్న వీడు మన ఇంటికొచ్చి, పెద్దగా అరిచినప్పుడు, అసలు ఎంట్రా వీడి ధైర్యం అని అనుకున్నా.. ఇప్పుడు అర్థమైంది. వీడు నడిస్తే వెనకాల లక్షమంది నడుస్తున్నారు. బహూశా ఇదే ఇతని ధైర్యమేమో. లేదు సార్.. ఆ లక్షలాది మందికే ఆయన ముందుండి నడుస్తున్నాడన్నదే ధైర్యం..’ అనే మాస్ డైలాగ్ ను పవన్ కోసం హరీశ్ శంకర్ రాశాడట. ఇదే డైలాగ్ ను ఇంటర్వ్యూలో చిరంజీవి కూడా చెప్పి అదరగొట్టాడు.
సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే మాస్ డైలాగ్స్ ను వదులుతూ హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’పై అంచనాలను పెంచేస్తున్నారు. ఈ ఒక్క డైలాగ్ తో గబ్బర్ సింగ్ ను మించి ఈ చిత్రం ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న రీలీజ్ కానుంది. దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేయగా.. చిరంజీవి, చరణ్ ప్రధాన పాత్రలో నటించారు. హీరోయిన్లుగా కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
