పవర్ స్టార్ పవర్ కళ్యాణ్  బిజీబిజీగా ఉన్నాడు త్వరగా సినిమాలు కంప్లీట్ చేసిన పాలిటిక్స్ కోసం కథన  రంగంలోకి దిగాలని చూస్తున్నాడు. ఈక్రమం.. ఆయన లిస్ట్ లోకి మరో సినిమావచ్చి చేరేలా ఉంది.

 రీ ఎంట్రీలో పవన్ కళ్యాణ్ కు సూపర్ డూపర్ హిట్ అందించిన సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈసినిమా పవర్ స్టార్ చాలా కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తరువాత మంచి కమ్ బ్యాక్ ను ఇచ్చింది. దిల్ రాజు నిర్మించిన ఈసినిమాకు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేశాడు. ఇక ఈ మూవీకి సీక్వెల్ ఉంటుంది అని అప్పుడే అనౌన్స్ చేశాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఈక్రమంలో.. ప్రస్తుతం ఈసినిమాకు సబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. 

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆతరువాత హరిహరవీరమల్లు కంప్లీట్ చేయబోతున్నాడు. వినోదయ సీతం షూటింగ్ కంప్లీట్ అయినా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉంటాయి. ఈక్రమంలో పవన్ కళ్యాణ్ కు వకీల్ సాబ్ సీక్వెల్ ను చేసే టైమ్ ఉంటుందా అని అనుమానం వ్యక్తం అవుతుంది. అయితే ప్రస్తుతం వకీల్ సాబ్ కు సబంధిచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుతుస్తున్నట్టు తెలుస్తోంది. 

ఓ మై ఫ్రెండ్ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన వేణు శ్రీరామ్, ఆ తరువాత 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు.దాంతో ఆయన వేణు శ్రీరామ్ తో, పవన్ కల్యాణ్ హీరోగా వకీలు సాబ్ సినిమా చేశాడు. ఈ సినిమా సూర్ హిట్ అవ్వడంతో.. వేణుకి వరుసగా ఆఫర్లు వస్తాయి అనుకున్నారంతా.. కాని ఆయన అల్లు అర్జున్ తో చేయాల్సి ఐకాన్ సినిమా కూడా ఆగిపోయింది. 

వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ సినిమా చేయాల్సి ఉంది. టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. కాని ఎందుకో ఆసినిమా అలా మరుగున పడిపోయింది. బన్నీ కూడా ఈ ప్రాజెక్టుపై అంతగా ఆసక్తిని చూపలేదు. దాంతో ఈసినిమాను వదిలేసి శ్రీరామ్.. వకీల్ సాబ్ సీక్వెల్ పై దృష్టి పెట్టారు. ప్రస్తుతం వకీల్ సాబ్ 2 కి సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. 

ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లను పూర్తిచేసుకుంది. అందువలన ఈ సినిమాను గురించిన సందడి సోషల్ మీడియా వేదికపై కనిపించింది. ఈ సినిమా సాధించిన సక్సెస్ ను గురించి వేణు శ్రీరామ్ గుర్తు చేసుకుంటూ, ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని గట్టిగానే చెప్పాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన కథను రెడీ చేస్తున్నానని అన్నాడు. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తానని చెప్పాడు. దాంతో ఇప్పుడు అభిమానులందరి దృష్టి అటు వైపు మళ్లింది.