పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెడ్ స్పీడ్ చూపిస్తున్నాడు. వరుసగా సినిమాలు కంప్లీట్ చేయాలని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు. ఈక్రమంలో.. ఆయన సాహో డైరెక్టర్ సుజిత్ తో చేస్తున్న OG సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అవ్వగా.. అప్పుడే మూవీ నుంచి అప్ డేట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు దర్శకుడు. 

సాహోతరువాత చాలా గ్యాప్ వచ్చింది డైరెక్టర్ సుజిత్ కు. సాహో దెబ్బ నుంచి కోలుకోవడానికి చాలా టైమ్ పట్టింది. సినిమాలు లేక ఇక సుజిత్ పని అయిపోయింది అనుకుంటున్న టైమ్ లో.. అవకాశం ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తను కమిట్ అయిన పాత సినిమాలకు కూడా టైమ్ ఇవ్వకుండా.. సుజిత్ తో సినిమా కన్ ఫార్మ్ చేసి.. వెంటనే షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. OG టైటిల్ తో ఈమూవీ తెరకెక్కుతోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మూవీని నిర్మిస్తున్నారు. ఇకతాజాగా ఈమూవీ నుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్ కోసం అప్ డేట్ రిలీజ్ చేశారు ఓజీ టీమ్. 

మా డైరెక్టర్ యమా క్రేజీ అంటూ డీవీవీ ఎంటర్టైన్మెంట్ వారు ముందే ట్వీట్ చేసినట్టుగానే... డైరెక్టర్ సుజిత్ కు సబంధించిన వీడియోనే రిలీజ్ అయ్యింది. పెన్ను.. గన్ను, బాలు.. బాంబ్, బుల్లెట్ లాంటి అక్షరాలు.. కత్తిలాంటి పదునైన డైలాగ్స్.. పక్కాగా ప్రిపేర్ అయ్యి.. పవర్ స్టార్ కోసం సెట్స్ పైకి వెళ్తున్నాము అననట్టుగా... డైరెక్టర్ సుజిత్ కు సబంధించిన ఓ వీడియోను OG మూవీ టీమ్ రిలీజ్ చేసింది. అంతే కాదు పవన్ కళ్యాణ్ నెక్ట్స్ వీక్ నుంచి షైూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్టు కూడా ప్రకటించారు. ఈసారి పక్కా ప్రణాళికతో హిట్ కొట్టడానికి గట్టిగా ప్రిపేర్ అయినట్టున్నాడు సుజిత్. తన టాలెంట్ అంతా ఉపయోగించి.. స్పెషల్ వీడియోతో పవర్ స్టార్ అభిమానులను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు. 

YouTube video player

.ఇలా సినిమా కన్ ఫార్మ్ అయ్యింది.. అలా షూటింగ్ స్టర్ట్ అయ్యింది. ఇంతలోనే ఓజీ నుంచి సాలిడ్ అప్ డేట్ ను రెడీ చేశాడు డైరెక్టర్ సుజిత్. దాంతో పవర్ స్టార్ అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. ఈవీడియో చూస్తుంటే.. పవన్ ను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు అర్ధం అవుతుంది. సాహోతో పాన్ ఇండియా ఫెయిల్యూర్ చూసిన సుజిత్.. పవర్ స్టార్ విషయంలో ఏం చేస్తాడా అని ఫ్యాన్స్ లో కాస్త భయం కూడా ఉంది. మరి సాహో దర్శకుడు ముంచుతాడా తేల్చుతాడా చూడాలి. 

ఇక ఎలక్షన్ హడావిడి స్టార్ట్ అయ్యే లోపు చేతిలో ఉన్న సినిమాలన్నీ ఫినిష్ చేయాలని రెడీ అవుతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సైమల్ టేనస్ గా షూటింగ్స్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే సముద్ర ఖని డైరెక్షన్ లో.. వినోదయ సీతం సినిమా టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన పవన్.. పస్తుతం హరీష్ శంకర్ కు కమిట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో ఉన్నాడు. మరో వైపు హరిహరవీరమల్లు ఫైనల్ గా షూటింగ్ కోసం ఎదురు చూస్తుంది టీమ్. ఇటు OG షూటింగ్ కూడా స్టార్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చారు పవర్ స్టార్. ఈ సినిమాకు తమన్ స్వారాలు సమకూర్చుతుండగా.. హీరోయిన్ ఇంకా కన్ ఫార్మ్ అవ్వనట్టు తెలుస్తోంది.