పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌ డే సందడి ఓ రేంజ్‌లో కనిపిస్తోంది. ఇప్పటికే అభిమానులు కోట్ల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులను మరింతగా ఉత్సాహపరిచేందుకు, అభిమానులకు కానుకగా పవన్‌ తాజా చిత్రం వకీల్‌ సాబ్‌ ఫస్ట్ లుక్ మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది.

బాలీవుడ్ సూపర్ హిట్ అయిన పింక్‌ సినిమాకు రీమేక్‌గా వకీల్ సాబ్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. హిందీ అమితాబ్‌ పోషించిన పాత్రలో తెలుగులో పవన్‌ నటిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్‌ దర్శకుడు. నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది.

తాజా రిలీజ్ చేసిన మోషన్‌ పోస్టర్‌తో అభిమానుల్లో సరికొత్త జోష్ నింపారు చిత్రయూనిట్. పవన్‌ కళ్యాణ్ క్రిమినల్ లా పుస్తకాన్ని చేతిలో పట్టుకొని యాక్షన్‌ మోడ్‌లో ఉన్న స్టిల్‌తో మోషన్‌ పోస్టర్‌ను డిజైన్‌  చేశారు. పోస్టర్‌లో పవన్‌ లుక్‌తో పాటు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అదిరిపోయేలా ఉంది. తొలిసారిగా పవన్‌ సినిమాకు సంగీతమందిస్తున్న తమన్‌, ఓ రేంజ్‌ మ్యూజిక్‌ తో పవర్‌ స్టార్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాడు.