Asianet News TeluguAsianet News Telugu

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పూనకాలే... 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ థియేటర్లకు పవన్ కల్యాణ్ బద్రి సినిమా..?

టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. కొద్ది రోజుల నుండి స్టార్ హీరోల పుట్టినరోజులు, బెంచ్ మార్క్ ఇయర్స్‌కి సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా రీ రిలీజ్ ల విషయంలో ఉత్సాహం చూపిస్తున్నారు. ఈక్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు బ్రేక్ ఇచ్చిన మూవీ థియేటర్లలో సందడి చేయబోతోంది. 

Power Star Pawan Kalyan Badri movie Re-Release
Author
First Published Dec 6, 2022, 11:03 AM IST

కొద్ది రోజుల నుండి స్టార్ హీరోల పుట్టినరోజులు, బెంచ్ మార్క్ ఇయర్స్‌కి సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా రీ రిలీజ్ ల విషయంలో ఉత్సాహం చూపిస్తున్నారు. ఈక్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు బ్రేక్ ఇచ్చిన మూవీ థియేటర్లలో సందడి చేయబోతోంది. 

స్టార్ హీరోల పాత సినిమాలకు మహర్ధశ వచ్చింది. ఏదో ఒక అకేషన్ చూసుకుని... ట్రెండ్ మార్క్ మూవీస్ ను  మళ్లీ థియేటర్ లో చూసే అవకాశం కలుగుతోంది అభిమానులకు. అప్పటి సినిమాలను డిజిటల్‌లోకి కన్వర్షన్ చేయించి పాత చిత్రాలను మళ్లీ రీ రిలీజ్ చేయడం అనే ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు మరో క్రేజీ ఫిలిం రీ రిలీజ్ కానుంది.. పవర్ స్టార్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ బద్రి.. థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. 

22 సంవత్సరాల తరువాత పవర్ స్టార్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యేలా బద్రి సినిమాను సిల్వర్ స్క్రీన్ మీద చూసే అవకాశం కల్పించబోతుననారు. ముఖ్యంగా దర్శకుడిగా పూరి జగన్నాథ్ కు ఇది ఫస్ట్ మూవీ.  మిలీనియం ఇయర్ లో వచ్చిన అద్బుతమైన సినిమాల్లో ఇది ఒకటి. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.. విజయలక్ష్మీ మూవీస్ బ్యానర్ మీద సీనియర్ ప్రొడ్యూసర్ టి. త్రివిక్రమ రావు నిర్మించగా.. అమీషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్లుగా నటించారు. రాక్ స్టార్ రమణ గోగుల మ్యూజిక్ సెన్సేషన్ అయింది. 

2000 ఏప్రిల్ 20న రిలీజ్ అయిన బద్రి సినిమాను అప్పుడు స్క్రీన్ మీద చూడలేని వారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తరువాత ఏర్పడిన థియేటర్లు, వాటి స్క్రీన్ ల మీద చూసి ఎంజాయ్ చేయబోతున్నారు. అంతే కాదు పవర్ స్టార్ అభిమానుల కోరిక మేరకు రీ మాస్టర్డ్ వెర్షన్ రెడీ చేస్తున్నారు. 4 K, డీటీఎస్, క్యూబ్ లాంటి వాటితో సినిమాను రీ ఎడిట్ చేసి..  కొత్త హంగులు అద్దుతున్నారు. 

ఇక బద్రి సినిమా 22 ఏళ్ళ తరువాత  త్వరలో రీ రిలీజ్ కానుందని తెలియజేస్తూ  ఓ వీడియో రిలీజ్ చేయగా నెట్టింట బాగా వైరల్ అవుతోంది.. పీకే ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ ట్రెండ్ చేస్తున్నారు.పవన్ కెరీర్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ.. రికార్డ్ రేంజ్ కలెక్షన్లు రాబట్టింది.. 

ఇక బద్రీ సినిమా విషయానికి వస్తే.. పవన్ మేనరిజమ్స్, డైలాగ్స్, సాంగ్స్ అయితే ఎవర్ గ్రీన్.. తన మ్యూజిక్ మ్యాజిక్‌తో యూత్‌ని మాయ చేశాడు రమణ గోగుల.. తమ్ముడు తర్వాత ఆయన పవన్‌తో చేసిన సెకండ్ సినిమా ఇది..బద్రి పవన్, పూరిలకు వెరీ స్పెషల్ ఫిలిం.. ఈ సినిమా అప్పుడే పవర్ స్టార్ రేణు దేశాయ్‌ని ఇష్టపడ్డారు. పూరి, అమీషా పటేల్ ఇద్దరికీ ఫస్ట్ ఫిలిం.. బ్రహ్మానందం, మల్లిఖార్జున రావు, ఆలీ కామెడీ హైలెట్ అసలు.. త్వరలో ట్రైలర్‌తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios