గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ “, కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “RED”, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “అల్లుడు అదుర్స్ “, బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “మాస్టర్ “డబ్బింగ్ మూవీ సంక్రాంతి పండగకు రిలీజ్ అయ్యాయి.   ఈ నాలుగు సినిమాలలో సంక్రాంతి విన్నర్ గా క్రాక్ నిలిచింది. అయితే సంక్రాంతి ఫెస్టివల్ ని మిగతా మూడు సినిమాలు కూడా బాగానే క్యాష్ చేసుకున్నాయి. కరోనా ఉన్నా మంచి ఓపినింగ్స్ వచ్చాయి. 

సంక్రాంతి తర్వాత వచ్చిన వీకెండ్..శని,ఆదివారాలు కూడా కలెక్షన్స్ స్టడీగానే ఉన్నాయి. అయితే ఆ తర్వాత నుంచి అంటే సోమవారం నుంచి కలెక్షన్స్ డ్రాప్ అవటం మొదలయ్యింది. చాలా సెంటర్లలో రెవిన్యూ అసలు రావటం లేదు. గత రెండు రోజులుగా అయితే అన్ని ఏరియాల్లో  దారుణమైన డ్రాప్ కనపడిందని ట్రేడ్ లో చెప్తున్నారు. రెడ్,క్రాక్ నిలబడతాయనుకుంటే వాటి పరిస్దితి కలెక్షన్స్ లేక అల్లాడుతున్నాయి. మళ్లీ వీకెండ్ కు, రిపబ్లిక్ డే కు కలెక్షన్స్ ఏమన్నా పుంజుకుంటాయేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. డబ్బింగ్ సినిమా మాస్టర్ ఆల్రెడి ప్రాఫెట్ జోన్ లోకి ఎంటరైంది. క్రాక్ జెన్యూన్ హిట్ అనిపించుకుంది. అల్లుడు అదుర్స్ పెద్ద డిజాస్టర్ అనిపించుకుంది. ఇక రెడ్ ..యావరేజ్ ముద్రవేయించుకుంది. కలెక్షన్స్ అయితే లేవు.