లోక్ సభ స్థానాల్లో గత కొంత కాలంగా సినీ గ్లామర్ టచ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఎక్కువగా భారతీయ జనతా పార్టీ మరోసారి పార్లెమెంట్ లో తన బలాన్ని చూపించుకునేందుకు సిద్ధమవుతోంది. కన్నడ రాజకీయాల్లో గత ఎలక్షన్స్ లో దాదాపు కాంగ్రెస్ కు గట్టిపోటీని ఇచ్చిన బీజేపీ ఇప్పుడు పార్లమెంట్ లో ఏ మాత్రం పట్టు వదలకూడదని ఆలోచిస్తోంది. 

కన్నడ సినిమాల్లో ఇప్పుడిపుడే పాపులర్ అవుతున్న మోడల్ నిషా యోగేశ్వర్ బెంగుళూర్ గ్రామీణా లోక్ స్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధమైంది. మొదటి ఈ స్థానంలో ఆమె తండ్రి సిపి యోగేశ్వర్ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని టాక్ వచ్చింది. బీజేపీ కూడా అందుకు ఒప్పుకుంది. కానీ సిపి యోగేశ్వర్ తన కూతురికి అవకాశం ఇవ్వాలని చెప్పడంతో బీజేపీ ఏ మాత్రం ఆలోచించకుండా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

సిపి యోగేశ్వర్ రాష్ట్ర స్థాయి ఎలక్షన్స్ లో బిజీ అవ్వాలని అనుకుంటున్నారు. ఇక నిషా ఈ ఎన్నికల్లో గెలిస్తే పార్లమెంట్ లో 28 ఏళ్ల ఎంపీ గా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పవచ్చు.  ఆమె గెలుపుపై ప్రస్తుతం సర్వేలు కూడా పాజిటివ్ గా ఉండడంతో బీజేపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది.