`సర్దార్ గబ్బర్‌సింగ్` నుంచి పవనే నన్ను తీసేశాడుః పోసాని సంచలన వ్యాఖ్యలు
`సర్దార్ గబ్బర్ సింగ్` (sardar gabber singh) చిత్రంలో కీలక పాత్రలో పోసాని కృష్ణమురళీ(posani krishna murali) నటించాల్సి ఉంది. కానీ ఆయన్ని పవన్ కళ్యాణ్(pawan kalyan) తీసేశారట. తాజాగా ఈ షాకింగ్ విషయాన్ని పోసాని వెల్లడించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఈ సంఘటనని పోసాని పంచుకున్నారు.
పవన్ కళ్యాణ్(pawan kalyan) కథ, రచనలో రూపొందిన చిత్రం `సర్దార్ గబ్బర్ సింగ్`(sardar gabbar singh). బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం చెందింది. ఈ సినిమాలో కీలక పాత్రలో పోసాని కృష్ణమురళీ(posani) నటించాల్సి ఉంది. కానీ ఆయన్ని పవన్ కళ్యాణ్ తీసేశారట. తాజాగా ఈ షాకింగ్ విషయాన్ని పోసాని వెల్లడించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఈ సంఘటనని పోసాని పంచుకున్నారు. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై, వైసీపీ నాయకులపై పవన్ ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో దానికి కౌంటర్‌గా పోసాని మాట్లాడారు. బ్యాక్ టూ బ్యాక్ ప్రెస్‌మీట్‌లతో తీవ్ర విమర్శలు చేయడంతోపాటు పవన్‌కి సంబంధించిన షాకింగ్ విషయాలను వెల్లడించారు. `సర్దార్ గబ్బర్ సింగ్` నుంచి తనని పవన్ తొలగించారని ఆరోపించారు. `ఒకసారి `సర్దార్ గబ్బర్‌సింగ్` షూటింగ్ జరుగుతుంటే రాత్రి షెడ్యూల్ చేయాల్సి వచ్చింది. సాధారణంగా నేను సాయంత్రం 6 గంటలకు వెళ్లిపోతా. పెద్ద హీరో కదాని రాత్రి 9గంటల వరకూ వేచి చూసినా ఆయన రాలేదు. రాత్రి 10.30గంటలకు ఇంట్లో భోజనం చేస్తుంటే ఆయన ఫోన్ చేశారు.
`ఏవండీ మేము పిచ్చోళ్లమా? చెప్పకుండా ఎలా వెళ్తారు? సినిమా అంటే ఏమనుకున్నారు?` అని పవన్ గట్టిగా అరిచారట. దీంతో పోసాని కోపం వచ్చిందని, `మీరు 10గంటలకు వస్తే, మేము అప్పటివరకూ ఉండాలా? నేను కూడా ఆర్టిస్ట్‌నే. 9గంటల వరకూ వేచి చూశా. నువ్వు రాలేదు` అని తాను కూడా గట్టిగానే రియాక్ట్ అయినట్టు పోసాని చెప్పారు. అంతే ఆ సినిమా నుంచి నెక్ట్స్ మినిట్ తీసేశారని తెలిపారు పోసాని. తన మీద పవన్‌కి పీకల మీది వరకు కోపం ఉందన్నారు. తాను మాత్రం ఆయనపై కోపం పెంచుకోలేదన్నారు. `30ఏళ్లుగా పరిశ్రమలో ఉంటున్నా. నాకు ఎవరూ శత్రువులు లేరు. నేను జగన్‌గారి అభిమానిని. ఆయనను ఏమైనా అంటే నాకు కోపం వస్తుంది. ఏది మాట్లాడినా మీడియా ముందే మాట్లాడతా` అని తెలిపారు పోసాని.