ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు బోయపాటి శ్రీనుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. బోయపాటి అనేవాడికి ఉన్న అహంకారం, చీప్ బిహేవియర్ ఇండస్ట్రీలో మరే దర్శకుడికి లేదని సంచలన కామెంట్స్ చేశారు. 

మరిన్ని విషయాలను చెబుతూ.. ''నా దగ్గర ముప్పై మంది వరకు అసిస్టెంట్ డైరెక్టర్లు, రచయితలుగా పని చేశారు. అందరూ చాలా మర్యాదగా వ్యవహరించారు ఒక్కడు తప్ప. ఎవరినైతే నేను ఇండస్ట్రీకి తీసుకొచ్చానో..? ఎవరినైతే ఇండస్ట్రీకి పరిచయం చేశానో..? వాడే బోయపాటి శ్రీను'' అని తెలిపారు.

ఈరోజు వరకు తనకు ఎవరి మీద వ్యక్తిగత కక్షలు లేవని, ఏమైనా ఉన్నా సరే మొహం మీద అనేసి పక్కకి వెళ్లిపోతానని చెప్పిన పోసాని.. బోయపాటి విషయంలో మాత్రం అలా లేనని అన్నారు.

బోయపాటి చాలా పేదోడని వాళ్ల కుటుంబం పూరి గుడిసెలో ఉండేవారని.. అతడి తండ్రి దర్గాలో వాచ్ మెన్ గా పని చేశారని వాళ్ల అన్నయ్యకి పాస్ పోర్ట్ స్టూడియో ఉండేదని చెప్పిన పోసాని.. వాళ్లకి ఇంట్లో జరగడం లేదని తమ్ముడికి ఏమైనా హెల్ప్ చేయమని బోయపాటి అన్నయ్యఅడగడంతో ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర బోయపాటిని జాయిన్ చేసినట్లు చెప్పారు.

పదేళ్ల పాటు వాడు డైరెక్టర్ అయ్యేవరకు మీ దగ్గరే ఉంచుకోమని ముత్యాల సుబ్బయ్యని రిక్వెస్ట్ చేసినట్లు చెప్పారు. అలాంటి వాడు తన భార్యతో వెకిలిగా మాట్లాడినట్లు పోసాని షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

''నేను డైరెక్ట్ చేసిన 'శ్రావణమాసం' సినిమా ఫ్లాప్ అయిందని బోయపాటి నా భార్య దగ్గరకి వచ్చి అన్నయ్యకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేదు కదా అందుకే ఇలా జరిగింది. రేపటి నుండి ఇంట్లో ఎలా గడుస్తుంది. బిల్స్ అన్నీ ఎలా కడతారని నా భార్య దగ్గర మాట్లాడాడు. నా భార్య బిఎస్సి, ఎంఎల్ చేసింది. చదువుకున్న మహిళ కావడంతో ఒక్క మాట కూడా అనకుండా తనలో తానే బాధ పడిందని'' చెప్పుకొచ్చాడు. 
 
''బోయపాటికి మేము ఎలాంటి సహాయం చేశామంటే.. ఒకరోజు మా ఇంటి ముందు కూర్చొని ఏడుస్తున్నాడు.. ఏం జరిగిందని వెళ్లి అడిగితే తన బిడ్డకి బాలేదని హాస్పిటల్ బిల్ కూడా కట్టలేని పరిస్థితని చెబితే .. బిల్ మొత్తం నా భార్య కట్టింది. అప్పుడే నేను కొన్న ఒక కారుని వాడికిచ్చి పంపించాను'' అంటూ బోయపాటికి చేసిన సహాయాన్ని గుర్తు చేసుకున్నాడు.

అంతగా సహాయం చేస్తే.. తన ప్రవర్తన మాత్రం చాలా చీప్ ఉంటుందని త్రివిక్రమ్, కొరటాల, సంపత్ నంది ఇలా తన దగ్గర పని చేసిన ఎవరూ అలా ప్రవర్తించలేదని కానీ వాడు(బోయపాటి) అలా చేశాడని బాధ మాత్రం ఉండిపోయిందని పోసాని స్పష్టం చేశాడు.