ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అలాగే సినిమాలు కూడా పాలిటిక్స్ ను టార్గెట్ చేసుకొని తెరకెక్కుతుండటం చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే పోసాని కృష్ణ మురళి కూడా తన పొలిటికల్ డ్రామాను రిలీజ్ చేయనున్నాడు. అయితే ఆయన పులివెందులలోని జగన్ అడ్డాలో సినిమాను ఎనౌన్స్ చేశారు. 

దీంతో జగన్ బయోపిక్కా..  లేక తెలుగు దేశం పార్టీపై ఉన్న కోపాన్ని సినిమాలో ఏమైనా చూపించబోతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే కొన్ని రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాలపై సినిమా తీస్తానని చెప్పిన పోసాని జగన్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. 

ఇక తెలుగు దేశం పార్టీపై మొదటి నుంచి ఆయన మాటల తూటాలను పేల్చుతున్నారు. ఇక ఇప్పుడు సినిమాను వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయం ఆడిటోరియంలో స్టార్ట్ చేయడం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైసిపి రాజకీయ నాయకులు అలాగే జగన్ అభిమానులు చుట్టూ ప్రక్కల నుంచి గ్రామా ప్రజలు పోసాని ఉన్న కార్యాలయానికి వచ్చారు.  

పులివెందుల సమీప ప్రాంతాల్లోనే 20రోజులు పాటు షూటింగ్ నిర్వహించనున్నారట. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలనీ పోసాని ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఆపరేషన్ దుర్యోధన వంటి సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న పోసాని సారూ ఏ విధంగా ఏపి రాజకీయాలను మలుపుతిప్పే సినిమా చేస్తారో చూడాలి. గోల్డెన్‌ఎర ప్రొడక్షన్‌ నెంబర్‌-1 లో నిర్మాత శ్రీధర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆలీ, జీవా, బాబుమోహన్‌ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.