నాకు నంది అవార్డు వద్దు, మళ్లీ ప్రకటించాల్సిందే-పోసాని

నాకు నంది అవార్డు వద్దు, మళ్లీ ప్రకటించాల్సిందే-పోసాని

ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డుల వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. తాజాగా అవార్డులపై పోసాని కృష్ణ మురళి స్పందించారు. ముఖ్యంగా "రద్దుచేస్తానంది" అంటూ ఆంధ్ర జ్యోతి పత్రికలో వచ్చిన కథనంపై పోసాని తీవ్రంగా స్పందించారు. ఆ పత్రికలో ఉటంకించిన ఆ ప్రభుత్వ వర్గం ఎవరో నా ముందుకు రమ్మనాలని సవాల్ విసిరారు పోసాని. ప్రభుత్వానికి ఆపాదించి ఇష్టం వచ్చిన కథనాలు ప్రచురించడం సరికాదన్నారు.

 

ఆ కథనంలో తెలంగాణలో పన్నులు కట్టినవాళ్లకు నంది అవార్డులు ఇచ్చాం అని ఉటంకించడం భావ్యం కాదన్నారు. తెలంగాణలో పన్నులు కడితే మాట్లాడకూడదా.. ప్రభుత్వ వర్గాలు అంటూ కట్టు కథలు అల్లి పత్రికలు రాస్తే నోరు మూసుకుని కూర్చోవాలా.. ఆ వర్గాలు ఎవరో తీసుకురావాలని, అసలు నంది అవార్డులకు, నాన్ లోకల్ కు సంబంధం ఏంటి. అని ప్రశ్నించారు.

 

నంది అవార్డుల పట్ల విమర్శలు వస్తే సమాధానం చెప్పాలి గానీ ఎదురు దాడి చేయొద్దని పోసాని సూచించారు. కులపిచ్చి మీకే అంతుంటే మాకు వుండదా.. కానీ సినిమాలో కులం వుండ కూడదని పోసాని అన్నారు. అధికారం ఎన్నాళ్లో వుండదని, న్యాయబద్ధంగా వ్యవహరించాలని పోసాని అన్నారు. నంది అవార్డు ఎవరి అబ్బ సొమ్ము కాదని పోసాని వ్యాఖ్యానించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించుకోండి. లోకేష్ పేరిట బంగారు నంది అవార్డులిచ్చుకోండి. కానీ అధికారం శాస్వతం కాదని పోసాని మండిపడ్డారు. తాను కమ్మ కులానికే చెందిన వాడినని, కానీ అవార్డుల విషయంలో విమర్శలు చేయాల్సి వస్తోందని, లోకేష్ లాంటి వాడు మంత్రిగా వుండటం ఖర్మ అని పోసాని ధ్వజమెత్తారు. తెలంగాణలో మమ్మల్ని రొహింగ్యాలుగా మార్చే కుట్ర చేయొద్దని పోసాని వ్యాఖ్యానించారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos