Asianet News TeluguAsianet News Telugu

పోసానిని బాధపెట్టిన సునీల్ డైలాగ్స్

  • సునీల్ హీరోగా ఉంగరాల రాంబాబు
  • సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు ఉంగరాల రాంబాబు
  • సునీల్ డైలాగ్స్ తో బాధపడిన పోసాని
posani hurt by sunil comments

కమెడియన్ గా సినీ కెరీర్ ని ప్రారంభించి.. హీరోగా మారిన నటుడు సునీల్. ప్రస్తుతం ఆయన వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఎలాగైనా మరో హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన.. క్రాంతి మాధవన్ దర్శకత్వంలో ‘ఉంగరాల రాంబాబు’ చిత్రాన్ని చేశారు.  ఈ చిత్రం సెప్టెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

ఈనేపథ్యంలో హైదరాబాద్ లో ఆదివారం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఉంగరాల రాంబాబు’ సినిమాలో సునీల్ చెప్పిన..‘ ఇండియా వెనకపడిపోతోంది డబ్బుల్లేక కాదు.. మానవత్వం లేక’ అనే డైలాగ్ తనను బాధపెట్టిందని చెప్పారు.

 

ఆయన డైలాగ్ వినగానే 32ఏళ్ల క్రితం తాను అనుభవించిన కష్టాలు గుర్తుకువచ్చాయని చెప్పారు. మద్రాసులో తినడానికి తిండి, డబ్బులు లేక తాను పడిన  బాధల గురించి వివరించారు. ఇప్పటికీ సినీ రంగంలో వెన్నుపోటు పోడిచే వాళ్లు చాలా మంది ఉన్నారని పోసాని ఆవేదన వ్యక్తం చేశారు.

 

అంతేకాదు.. రాను రాను మానవత్వం లేకుండా పోతోందని, స్టేజీ మీద కనిపించే నవ్వులు,సిన్సియారిటీ నిజ జీవితాల్లో కనపడటం లేదన్నారు. ఏ సినీ పరిశ్రమలోనూ కమెడియన్లందరూ కలిసి ఉండటం జరగదని, కానీ తెలుగు సినీ ఇండస్ట్రీ మాత్రం అలాకాదని ఆయన అన్నారు. వారంతా ఒక కుటుంబంలా ఉంటామని చెప్పారు. కేవలం నటించేటప్పుడు మాత్రమే ఆయా పాత్రల్లోకి ప్రవేశిస్తాం.. తర్వాత మళ్లీ అందరం కలిసిపోతామని చెప్పారు.

 

అనంతరం అలీ  మాట్లాడుతూ  కామెడీ చేసిన వాడు  ఏదైనా చేయ‌గ‌ల‌డ‌ని   ర‌జ‌నీకాంత్  అన్న మాటలను గుర్తుకు చేసుకున్నాడు. ‘చేసుకున్న క‌ర్మ‌ను అనుభ‌వించేవారిని న‌వ్వించ‌డ‌మే తాము  చేయాల్సిన ప‌ని. ఈ మంచి ప‌ని భ‌విష్య‌త్తులో తమ  పిల్ల‌ల‌కు మంచి చేస్తుంద‌ని’ అంటూ సునీల్ చేసిన కామెంట్స్ వెనుక వేదాంత ధోరణి తొంగి చూసింది. మంచి దర్శకుడి గా పేరుగాంచిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఎట్టి  పరిస్థితులలోను హిట్ కావలిసిన పరిస్థితులు సునీల్ కు ఏర్పడ్డాయి

Follow Us:
Download App:
  • android
  • ios