పాపులర్‌ కెనడియన్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌ అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు పక్షవాతం సోకింది. ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు.

కెనడియన్‌ పాప్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌ అరుదైన జబ్బుతో బాధపడుతున్నారు. ఆయన పక్షవాతం సోకింది. వైరస్‌ కారణంగా ఆయన ముఖంలోని ఓ వైపు పనిచేయడం లేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బీబర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్‌ వీడియోని పంచుకున్నారు. దీన్ని రామ్సే హంట్‌ సిండ్రోమ్‌ అంటారని, ఈ వైరస్‌ కారణంగా కనీసం ఓ వైపు కన్నురెప్పకూడా మూయలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ వైరస్‌ తన నాఢీ వ్యవస్థపై దాడి చేసిందని, అందుకే ముఖానికి పక్షవాతం వచ్చిందని బీబర్‌ తెలిపారు. 

తనకు సోకిన పక్షవాతం(రామ్సే హంట్‌ సిండ్రోమ్‌) కారణంగా టొరంటో, వాషింగ్టన్‌ డీసీల్లో షోలు రద్దు చేసుకున్నట్టు తెలిపారు. తన ముఖం కుడివైపులో కదలికలు లేవని, పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలిపారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించాలని అభిమానులను కోరాడు. ఇందులో ఆయన చెబుతూ, `నా షోలు రద్దు చేయడం వల్ల అసహనానికి గురైన వాళ్లందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. శారీరకంగా నేను ఆ షోలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. నేను కాస్త నెమ్మదించాలని నా శరీరం చెబుతోంది. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా పక్షవాతం వచ్చిన వైపు తాను కనీసం నవ్వలేకపోతున్నానని, కనురెప్ప వేయలేకపోతున్నట్లు చెప్పాడు బీబర్‌. 

ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి ఇంకా ఎంత టైమ్‌ పడుతుందనే తాను చెప్పలేనని, ఈ విశ్రాంతి సమయంలో తాను కాస్త రిలాక్స్ అవుతానని తెలిపారు. ఫేసియల్‌ ఎక్సర్‌సైజుల ద్వారా కోలుకోవడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ ఎమోషనల్‌ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతుంది. కోట్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ట్రెండ్‌ అవుతుంది. ఇదిలా ఉంటే మార్చి నెలలో ఆయన భరా్య హేలీ కూడా మెదడులో రక్తం గడ్డకట్టడంతో హాస్పిటల్‌లో చేరారు. ఇప్పుడు ఆయన ఆసుపత్రి పాలు కావడం విచారకరం. 

View post on Instagram