Asianet News TeluguAsianet News Telugu

గుండెపోటుతో పాపులర్‌ పాటల రచయిత కన్నుమూత.. సీఎం సంతాపం

మలయాళానికి చెందిన దిగ్గజ పాటల రచయిత బిచు తిరుమల(80) శుక్రవారం తుదిశ్వాస విడిచారు.గుండెపోటు కారణంగా ఆయన మరణించినట్టు తెలుస్తుంది. 

populer malayala lyricist bichu thirumala no more cm condolence
Author
Hyderabad, First Published Nov 27, 2021, 8:28 AM IST

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. పాపులర్‌ పాటల రచయిత కన్నుమూశారు. మలయాళానికి చెందిన దిగ్గజ పాటల రచయిత బిచు తిరుమల(80)(Bichu Thirumala) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించినట్టు తెలుస్తుంది. శుక్రవారం ఆయనకు హార్ట్ ఎటాక్‌ రావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ Bichu Thirumala మరణించారు. దిగ్గజ పాటల రచయిత బిచు తిరుమల మరణం పట్ల కేరళా సీఎం పినరయి విజయన్‌ సంతాపం తెలిపారు. ఆయన తన అద్భుతమైన పాటలతో శ్రోతలకు దగ్గరయ్యారని తెలిపారు. మరోవైపు ఎడ్యూకేషన్‌ మినిస్టర్‌ వి శివన్‌ కుట్టి కూడా తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. 

బి. శివశంకరణ్‌ నాయర్‌గా జన్మించిన ఆయన సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకున్నారు. బిచు తిరుమలగా పాపులర్‌ అయ్యారు. 1941, ఫిబ్రవరి 13న త్రివేండ్రమ్‌లో జన్మించారు. 1970 నుంచి 1990 వరకు మలయాళ చిత్ర పరిశ్రమని పాటల రచయితగా ఓ వెలుగు వెలిగారని చెప్పొచ్చు. ఆయన ఇప్పటి వరకు మూడు వేలకు పైగా పాటలు రాశారు. అందులో చాలా వరకు ఆధ్యాత్మిక పాటలు కూడా ఉండటం విశేషం. `త్రిష్ణ`, `తేనుమ్‌ వయంబుమ్‌`, `కడింజూన్‌ కల్యాణం` అనే సినిమాల్లో పాటలకుగానూ ఆయన రెండు సార్లు కేరళ స్టేట్‌ ఫిల్మ్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. 

ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎస్‌ విశ్వనాథన్‌, శంకర్‌-గణేష్‌, ఏ.ఆర్‌ రెహ్మాన్‌, ఇళయరాజా వంటి అనేక మంది సంగీత దర్శకులతో ఆయన పనిచేశారు. 1972 నుంచి ఇప్పటి వరకు పాటలు రాస్తూనే ఉన్నారు. పాటల రచయితగా, పోయెట్‌గా, ఆథర్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా, స్క్రీన్‌ రైటర్‌గా, మ్యూజిక్‌ కంపోజర్‌గా, సింగర్‌గానూ రాణించారు. బిచు తిరుమల మృతి పట్ల మలయాళ చిత్ర ప్రముఖులు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు. 

also read: విషాదంః ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌.నాగేశ్వరరావు కన్నుమూత ..

Follow Us:
Download App:
  • android
  • ios