కరోనా మరో సినీ నటుడిని బలి తీసుకుంది. ప్రముఖ హిందీ నటుడు లలిత్‌ బెహల్‌(71) శనివారం కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. 

కరోనా మరో సినీ నటుడిని బలి తీసుకుంది. ప్రముఖ హిందీ నటుడు లలిత్‌ బెహల్‌(71) శనివారం కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, ప్రముఖ దర్శకుడు కాను బెహల్‌ వెల్లడించారు. `నాన్నకి హృద్రోగ సమస్యలు ఉన్నాయి. దీనికి తోడు ఆయన కోవిడ్‌ 19 బారిన పడ్డారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించింది. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ మరింత సీరియస్‌ గా మారడంతో ఆయన తుది శ్వాస విడిచారు` అని తెలిపారు. లలిత్‌కి కరోనా సోకడంతో గత వారం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు.

 `తిత్లీ`, `ముక్తి భవన్‌` వంటి కమర్షియల్ గా‌, క్రిటిక్స్ వైజ్‌గా ప్రశంసలందుకున్న సినిమాల్లో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు లలిత్‌ బెహల్‌. `తిత్లీ`కి తనయుడు దర్శకత్వం వహించడం విశేషం. కంగనా రనౌత్‌ చిత్రం `జడ్జిమెంటల్‌ హై క్యా`, వెబ్‌ సిరీస్‌ `మేడిన్‌ హెవెన్‌`లో లలిత్‌ బెహల్‌ చివరిసారిగా నటించారు. రంగస్థల నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన, దూరదర్శన్‌ కోసం దర్శకుడిగా, నిర్మాతగా `తాపిష్‌`, `ఆతిష్‌`, `సనెహరి జిల్డ్` వంటి టెలీఫిల్మ్స్‌ రూపొందించారు. పలువురు ప్రముఖులు లలిత్‌ బెహల్‌ మృతి పట్ల విచారాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Scroll to load tweet…