బాలీవుడ్ రీమేక్ గా ‘నాంది’, ’ఉప్పెన’ హీరోలు ఎవరంటే...?
ఈ మధ్య కాలంలో హిందీ నుంచి తెలుగుకు, తెలుగు నుంచి హిందీకు కథల వలసలు తెగ జరుగుతున్నాయి. స్టార్ హీరోలు ఈ రీమేక్ ల మీద చాలా ఆసక్తి చూపిస్తున్నారు. రీమేక్ సినిమా రైట్స్ ఉంటే ఖచ్చితంగా వెంటనే హీరోల డేట్స్ దొరికేస్తున్నాయని నిర్మాతలు అంటున్నారు. ఈ నేపధ్యంలో అల్లరి నరేష్ తాజా హిట్ చిత్రం నాందిని సైటం హిందీలో రీమేక్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు కొందరు హీరోలు స్పెషల్ షోలు చూసి ,ఓకే చేసేందుకు రంగం రెడీ అవుతోంది.

వివరాల్లోకి వెళితే... ‘నాంది’ మూవీతో చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ట్రాక్ ఎక్కాడు అల్లరి నరేష్. తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లతో దూసుకుతుంది. ఈ నేపధ్యంలో ఈ సినిమాను హక్కుల కోసం బాలీవుడ్ నిర్మాతలు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో నాంది చిత్రాన్ని ఇతర భాషల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు.
ఈ మద్యే టీం ని అభినందించిన అయన నాంది సినిమాను హిందీ తో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు భాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను ముందు హిందీలో రీమేక్ చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట.
ప్రస్తుతం నానీ నటించిన జెర్సీ సినిమాను హిందీలో నిర్మిస్తోన్న ఆయన , నాంది రీమేక్ రైట్స్ తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాను తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు.. హిందీలోకి కూడా తీసుకెళ్ళ ప్రయత్నాల్లో దిల్ రాజు ఉన్నారని టాక్. హిందీలో ఈ సినిమాని ఆయుష్మాన్ ఖురానాతో చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఉన్నారట. లేకపోతే రాజ్ కుమార్ రావు ని సీన్ లోకి తెద్దామా అని భావిస్తున్నారట.
ఇప్పటికే ఉప్పెన, క్రాక్, మాస్టర్ వంటి పలు సినిమాలు కూడా బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నాయి. బాలీవుడ్ రీమేక్‌లో నటించే హీరోలు కూడా ఫైనలైజ్ కూడా అయ్యాయి. ’ఉప్పెన’ సినిమా హిందీ రీమేక్ హక్కులు మంచి రేటుకు అమ్ముడు పోయినట్టు సమాచారం. ఈ సినిమాను బాలీవుడ్‌లో ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే హీరో, హీరోయిన్లుగా రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు ఉప్పెన సినిమాను తమిళంలో విజయ్ కుమారుడు సంజయ్ తో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అన్ని భాషలకు సంబంధించిన రీమేక్స్‌లో విలన్‌గా విజయ్ సేతుపతి నటించే అవకాశం ఉంది.