జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి, సాయికుమార్‌ ప్రధాన పాత్రల్లో ‘సువర్ణ సుందరి’చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జయప్రదకు తల్లిగా యంగ్‌ హీరోయిన్‌ పూర్ణ నటిస్తున్నారు.  ఈ చిత్రానికి ఎమ్‌ఎస్‌ఎన్‌ శివ దర్శకత్వం వహిస్తున్నారు. ‘చరిత్ర భవిష్యత్‌ను వెంటాడుతోంది’ అనేది ట్యాగ్‌లైన్‌ తో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్ గా సాగింది.

ట్రైలర్ ని బట్టి ..పురాతన గనుల్లో దొరికిన ఓ విగ్రహం చుట్టూ కథ తిరుతుందని అర్దమవుతోంది. ఈ విగ్రహానికి అశేషమైన శక్తులు ఉంటాయి. అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకు ప్రతిదీ స్పష్టంగా వినిపిస్తుందని, పక్కన ఉన్న వాళ్ళను హత్య చేసేందుకు ఉసిగోలుపుతుందని తెలుస్తోంది. అలాగే ఆ విగ్రహం  ఎప్పుడో శతాబ్దాల నాటి పాత చరిత్ర  ప్లాష్ బ్యాక్ ఉంటుంది. అదేమిటి అనేదే కథ అని తెలుస్తోంది. 

దర్శకుడు సూర్య మాట్లాడుతూ - ''1509 సంవత్సరంలో ప్రారంభమై నేటి(2017) వరకూ.. అంటే నాలుగు శతాబ్ధాల్లో జరిగే కథ ఇది. సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ మూవీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కాలాదుల్ని బట్టి వేర్వేరు లొకేషన్లలో చిత్రీకరణ చేశాం, చరిత్ర ఎప్పుడూ విజయాల గురించి చెబుతుంది. అయితే చరిత్రలో బయటికి తెలీని చీకటి కోణాలుంటాయి. అలాంటి ఓ చీకటి కోణం ఇప్పటివరకు రకరకాల జనరేషన్లపై ఎలాంటి ప్రభావం చూపించింది అన్నదే ఈ చిత్రంలోని ప్రధాన కథాంశం. అప్పటి జనరేషన్‌, ఇప్పటి జనరేషన్‌ గ్యాప్‌ని అర్థవంతంగా చూపించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం అన్నారు. 

జయప్రద,పూర్ణ,  సాక్షిచౌదరి, రామ్‌, ఇంద్ర, సాయికుమార్‌, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ ఖాన్‌, అవినాష్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎల్లు మహంతి, సంగీతం: సాయి కార్తిక్‌, ఎడిటింగ్‌: పవ్రీణ్‌ పూడి. నిర్మాత: ఎమ్.ఎల్.లక్ష్మి, దర్శకత్వం: సూర్య ఎమ్‌.ఎస్.ఎన్