నిన్నటి రోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమిగోస్ ఈ హైప్ ని ఏ విధంగా ఉపయోగించుకుంది.. ప్రమోషన్స్ తో తెప్పించిన ఇంట్రెస్ట్ ని సినిమాతో ఏ మేరకు కంటిన్యూ చేసారు...
హిట్ ,ప్లాఫ్ లకు సంభందం లేకుండా ముందుకు వెళ్తున్న హీరో కళ్యాణ్ రామ్. కెరీర్ లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేసాడు. గత ఏడాది కళ్యాణ్ రామ్ బింబిసారతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అదే ఉత్సాహంతో రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో మరోసారి ప్రయోగాత్మక కథతో అమిగోస్ చేసాడు. అమిగోస్ అనే గమ్మత్తైన టైటిల్‌తో సినీ ప్రేమికులలో విపరీతమైన ఆసక్తిని సృష్టించింది. స్పానిష్ టైటిల్ తో ప్రేక్షకులు అమిగోస్ కి కనెక్ట్ అయ్యేలా కళ్యాణ్ రామ్ అండ్ టీమ్ ప్రమోట్ చేసారు.
కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్, ఆ పాత్రల లుక్స్, టీజర్ మరియు ట్రైలర్ అందరిలో సినిమాపై ఆసక్తిని రేపాయి. సాంగ్స్ లో కళ్యాణ్ రామ్-హీరోయిన్ అషిక రంగనాథ్ కెమిస్ట్రీ ఎట్రాక్ట్ చేసింది. నిన్నటి రోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమిగోస్ ఈ హైప్ ని ఏ విధంగా ఉపయోగించుకుంది.. ప్రమోషన్స్ తో తెప్పించిన ఇంట్రెస్ట్ ని సినిమాతో ఏ మేరకు కంటిన్యూ చేసారు...ఓపినింగ్స్ వచ్చాయా అంటే...
కళ్యాణ్ రామ్ గత చిత్రం #Bimbisara ఓపినింగ్ రోజు షేర్ 7.2 కోట్లు వచ్చింది. #Amigos చిత్రం ఆ స్దాయి ఓపినింగ్స్ ని తెచ్చుకోలేకపోయిందని ట్రేడ్ వర్గాల సమాచారం. దాదాపు మూడు కోట్లు దాకా షేర్ వచ్చిందంటున్నారు. రెండు వరస హిట్స్ కళ్యాణ్ రామ్ కెరీర్ లో కనపడలేదు. అదే సెంటిమెంట్ ఇక్కడా రిపీట్ అయ్యిందంటున్నారు.
ఇక ఈ చిత్రం అందుతున్న సమాచారం మేరకు 26 కోట్ల రూపాయలతో రూపొందింది. బింబిసార సినిమా తర్వాత వస్తుండటంతో మార్కెట్‌లోను, అలాగే ట్రేడ్ సర్కిళ్లలో భారీగా క్రేజ్ నెలకొన్నది. దాంతో ఈ సినిమాపై భారీగా బిజినెస్ జరిగింది. కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే బెస్ట్ బిజినెస్ జరిగింది. అమిగోస్ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 4.5 కోట్లు, సీడెడ్‌లో 2.5 కోట్లు, ఆంధ్రాలో 7 కోట్ల మేర జరిగింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 14.5 కోట్ల మేర ముగిసింది. ఇక కర్ణాటక థియేట్రికల్ హక్కులు 80 లక్షలు, ఓవర్సీస్‌లో 90 లక్షల మేర బిజినెస్ జరగడంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 16 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా 750 స్క్రీన్లలో రిలీజైంది. నైజాంలో 160 స్క్రీన్లు, సీడెడ్‌లో 60 స్క్రీన్లు, ఆంధ్రాలో 210 స్క్రీన్లతో మొత్తం 425 స్క్రీన్లలో రిలీజైంది. ఇక కర్నాటక, ఇతర రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో 260 స్క్రీన్లలో రిలీజ్ అయింది. దాంతో ఈ సినిమాను మొత్తంగా 750 స్క్రీన్లలో విడుదల చేశారు.
