వివాదాస్పద, సంచలన నటి పూనమ్‌ కౌర్‌ స్పందించింది. తన సపోర్ట్ ప్రకాష్‌రాజ్‌కే అని చెప్పింది. ఆయన గెలిస్తే తన సమస్యలను చెప్పేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది.   

`మా`( మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. మరోవైపు ఎన్నికల ప్రచారం షురూ చేశారు పోటీలో ఉన్న మంచు విష్ణు, ప్రకాష్‌ రాజ్‌. వీరికి సినిమా సెలబ్రిటీలు మద్దతు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా వివాదాస్పద, సంచలన నటి పూనమ్‌ కౌర్‌ స్పందించింది. తన సపోర్ట్ ప్రకాష్‌రాజ్‌కే అని చెప్పింది. ఆయన గెలిస్తే తన సమస్యలను చెప్పేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది.

ట్విట్టర్‌ ద్వారా పూనమ్‌ మద్దతు తెలిపింది. `మా` ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌ సర్‌ గెలవాలని కోరుకుంటున్నా. ఇంతకాలం నిశబ్థం ఉన్న నాకు ఆయన గెలిస్తే పరిశ్రమలో నేను ఎదుర్కొన్న సమస్యలను చెప్పే అవకాశం వస్తుంది. ఎందుకంటే ఆయన మాత్రమే వాస్తవికంగా ఉంటారని నా నమ్మకం. ప్రకాశ్ రాజ్‌కు పెద్దల పట్ల గౌరవం, ఇచ్చిన మాట కు కట్టుబడి ఉంటారు. ఆయన ప్రకాశ్ రాజ్ చెత్త రాజకీయాలు చేయరు. అందుకే ఆయనకు తన మద్దతు ఉంటుంది. జైహింద్‌` అంటూ తన పోస్ట్ చేసింది పూనమ్‌. 

Scroll to load tweet…

 పంజాబీ భామ అయిన పూనమ్‌ హీరో శ్రీకాంత్‌ `మాయాజాలం` మూవీతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత `వినాయకుడు`, `శౌ`ర్యం`, `గణేశ్`, `గగనం`, శ్రీనివాస కల్యాణం` వంటి చిత్రాల్లో సహానటిగా కనిపించింది.