నటి పూనమ్‌ కౌర్‌ సంచలన ట్వీట్‌ చేసింది. ఇప్పటికైనా అమ్మని, అమ్మాయిలను గౌరవించడం నేర్చుకో అంటూ ఘాటుగా చెబుతూనే త్వరగా కోలుకోవాలని పేర్కొంది పూనమ్ కౌర్‌. అయితే ఇది నటుడు, దర్శకుడు, విమర్శకుడు కత్తి మహేష్‌పైనే అని తెలుస్తుంది.

నటి పూనమ్‌ కౌర్‌ సంచలన ట్వీట్‌ చేసింది. ఇప్పటికైనా అమ్మని, అమ్మాయిలను గౌరవించడం నేర్చుకో అంటూ ఘాటుగా చెబుతూనే త్వరగా కోలుకోవాలని పేర్కొంది పూనమ్ కౌర్‌. అయితే ఇది నటుడు, దర్శకుడు, విమర్శకుడు కత్తి మహేష్‌పైనే అని తెలుస్తుంది. కత్తి మహేష్‌ శనివారం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. నెల్లూరు సమీపంలోని కొడవలూరు మండలం చంద్రశేఖరపురం దగ్గర జాతీయ రహదారిపై మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న కంటెనర్‌ను ఢీకొట్టింది. వెంటనే కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కత్తి మహేష్‌ ప్రమాదం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉండటంతో చెన్నైకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య ఆందోళనకరంగానే ఉందని, సీట్‌ బెల్ట్ పెట్టుకోకపోవడంతో తలకి బలంగా గాయమైందని అంటున్నారు. ఓ కన్ను పూర్తిగా డ్యామేజ్‌ జరిగిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు కత్తి మహేష్‌ త్వరగా కోలుకోవాలని, తన పదునైన ప్రశ్నలతో అన్యాయంపై పోరాడాలని, తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నటి పూనమ్‌ కౌర్‌ ఓ సంచలన ట్వీట్‌ చేసింది. 

`కర్మ దేవో భవ. రాముడిని, సీతని నీ అవసరానికి ఇష్టమొచ్చినట్టుగా వాడుకున్నావ్, వదిలేశావ్ ఏళ్ల నుంచి పద్దతిగా తన పని తాను చేసుకునే బ్రహ్మణ అమ్మాయిని.. నువ్ ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇకనైనా అసలు జీవితాన్ని చూస్తావని, ఇప్పటికైనా అమ్మాయిలను, అమ్మని గౌరవించడం నేర్చుకో జై శ్రీరామ్` అని పూనమ్ కౌర్ ట్వీట్ వేశారు. అయితే ఇందులో పూనమ్‌ కౌర్‌ డైరెక్ట్‌గా కత్తి మహేష్‌ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ నెటిజన్లు మాత్రం అది కత్తి మహేష్ గురించేనని అంటున్నారు. కత్తి మహేష్.. పవన్ కళ్యాణ్ వ్యవహారంలో పూనమ్ కౌర్ కౌంటర్‌ అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 

Scroll to load tweet…