జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సోమవారం రోజు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు వైభవంగా పవన్ బర్త్ డే ని సెలెబ్రేట్ చేశారు. సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో నిలిచింది. ఇదిలా ఉండగా నికీషా పటేల్ పవన్ కి బర్త్ డే విషెష్ తెలుపుతూ పొరపాటున రాంగ్ హ్యాష్ ట్యాగ్ జత చేసింది. 

దీనితో పవన్ అభిమానులు నికీషా పై ఆగ్రహంతో ట్రోల్ చేయడం ప్రారంభించారు. మీడియాలో కూడా ఈ వార్త హైలైట్ అయింది. వెంటనే స్పందించిన నికీషా పొరపాటున ఆ హ్యాష్ ట్యాగ్ జత చేశానని, కొంతమంది ఇడియట్స్ ఆ హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేయడం వల్లే పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చింది. మీడియా, పవన్ అభిమానులు ఇకపై సైలెంట్ అయిపోవాలని కోరింది. పవన్ పై తనకు గౌరవం ఉందని ఆయన్ని కించపరచాలనే ఉద్దేశం లేదని నికీషా తెలిపింది. 

ఈ మొత్తం వివాదంపై మరో హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందిస్తూ నికీషా పటేల్ కు మద్దత్తు తెలిపింది. 'నికీషా ఎవరి కోసమో నువ్వు నీ నిజాయతీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో కూడా నువ్వు ఓ మీడియా వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నావు. ఈ నెగిటివిటీని పట్టించుకోవద్దు అని నికీషాకు పూనమ్ కౌర్ సూచించింది. 

పావలా కళ్యాణ్ అంటూ హీరోయిన్ ట్వీట్.. సోషల్ మీడియాలో రచ్చ!