పూనమ్ టార్గెట్ చేసిన డైరెక్టర్ ఎవరో?

poonam kaur comments on tollywood top director
Highlights

కాస్టింగ్ కౌచ్ అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీరెడ్డి పలువురు ప్రముఖులపై కామెంట్లు 

కాస్టింగ్ కౌచ్ అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీరెడ్డి పలువురు ప్రముఖులపై కామెంట్లు చేసి 'శ్రీలీక్స్' అంటూ కొన్ని వీడియోలను, ఫోటోలను సైతం రివీల్ చేసింది. వీటిని మరువక ముందే ఇప్పుడు నటి పూనమ్ కౌర్ కూడా ఇటువంటి లీక్స్ మొదలుపెట్టింది. ఓ ప్రముఖ డైరెక్టర్ ను టార్గెట్ చేస్తూ పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది.

''ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ ఉన్నాడు.. అతడు సినిమాలు మాత్రమే కాదు మనుషుల జీవితాలను కూడా డైరెక్ట్ చేస్తుంటాడు. నన్ను కూడా చేయాలని చూశాడు. నన్ను మార్చే ప్రయత్నం చేశాడు.. ఎప్పుడైతే నేను దీనిపై వివరణ కోరానో అసలు ఏం జరగనట్లు ప్రవర్తించాడు. ఇండస్ట్రీలో అతడికి సంబంధించిన అమ్మాయిలు మాత్రమే హీరోయిన్లుగా ఉండాలని అనుకుంటాడు. ఆయన చెందిన ఒక హీరోయిన్ కు ప్రస్తుతం వరుస ఫ్లాపులు వస్తున్నప్పటికీ ఇంకా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు' అంటూ పూనమ్ ఫైర్ అయింది. ఆ దర్శకుడు ఎవరనే విషయాన్ని వెల్లడించకుండా కాస్టింగ్ కౌచ్ అనే పదం వాడకుండా పూనమ్ బాగానే తెలివి ప్రదర్శించింది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో..!
 

loader