ఆ నిర్మాత ఛాన్స్ ఇస్తానని రమ్మన్నాడు.. తీరా వెళ్తే: పూనమ్

poonam kaur comments on producer
Highlights

కొన్నేళ్ల క్రితం ఓ పెద్ద నిర్మాత మా ఇంటికి వచ్చాడు. నువ్ చాలా బాగా నటిస్తావు.. నీకు పెద్ద హీరోల సరసన అవకాశం ఇప్పిస్తాను. ఒకసారి కలువు అని చెప్పారు. వారం తరువాత అమ్మని తీసుకొని అతడి ఆఫీస్ కు వెళ్లాను

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూనమ్ కౌర్ ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించింది. కానీ అమ్మడుకి సరైన బ్రేక్ మాత్రం దక్కలేదు. ఈ మధ్యకాలంలో కాస్టింగ్ కౌచ్, అలానే హీరో పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ నిర్మాత తనను తప్పుడు ఉద్దేశంతో ఆఫీస్ కు పిలిపించినట్లు చెప్పుకొచ్చింది.

'కొన్నేళ్ల క్రితం ఓ పెద్ద నిర్మాత మా ఇంటికి వచ్చాడు. నువ్ చాలా బాగా నటిస్తావు.. నీకు పెద్ద హీరోల సరసన అవకాశం ఇప్పిస్తాను. ఒకసారి కలువు అని చెప్పారు. వారం తరువాత అమ్మని తీసుకొని అతడి ఆఫీస్ కు వెళ్లాను. అమ్మని నాతో పాటు తీసుకొచ్చానని నాతో సరిగ్గా మాట్లాడలేదు కూడా.. ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా ఛాన్స్ ఇవ్వలేదు. టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు సక్సెస్ అయ్యారు..

అందరూ బయటకు సంతోషంగానే ఉన్నా.. లోలోపల మాత్రం చాలా బాధ పడుతుంటారు. కానీ హీరోల విషయం అలా కాదు.. పెళ్లి టైమ్ కి వాళ్ళు బాగానే చేసుకుంటారు. కానీ హీరోయిన్స్ అలా కాదు.. వాళ్ల జీవితాన్ని త్యాగం చేయాల్సి వస్తుందని'' వెల్లడించింది. 

loader