ఆ తర్వాత జస్ట్‌ సెకండ్‌ హీరోయిన్‌గా, క్యారెక్టర్‌గా ఆర్టిస్టుగా మారిపోయింది పూనమ్‌ కౌర్‌. దాదాపు పదేళ్ల పాటు కెరీర్‌ని లాక్కొచ్చిన ఈ బ్యూటీ గత నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. 

పూనమ్‌ కౌర్‌(Poonam Kaur).. తెలుగులో హీరోయిన్‌గా సందడి చేసింది. `మాయాజాలం` చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామ `ఒక వి చిత్రం` చిత్రంతో మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఆ తర్వాత జస్ట్‌ సెకండ్‌ హీరోయిన్‌గా, క్యారెక్టర్‌గా ఆర్టిస్టుగా మారిపోయింది పూనమ్‌ కౌర్‌. దాదాపు పదేళ్ల పాటు కెరీర్‌ని లాక్కొచ్చిన ఈ బ్యూటీ గత నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇంకా చెప్పాలంటే సరైన అవకాశాలు లేక ఈ భామకి పెద్ద గ్యాప్‌ వచ్చింది. తెలుగులో చివరగా 2018లో వచ్చిన `శ్రీనివాస కళ్యాణం`, `నెక్ట్స్ ఏంటీ?` చిత్రాల్లో మెరిసింది. ఆ తర్వాత కనిపించని పూనమ్‌ కౌర్‌ మళ్లీ టాలీవుడ్‌ తెరపై సందడి చేసేందుకు వస్తుంది. 

ప్రస్తుతం నాలుగేండ్ల గ్యాప్‌ తర్వాత తెలుగులో `నాతిచరామి` చిత్రంలో నటిస్తుంది. అరవింద్‌ కృష్ణ హీరోగా నటిస్తుండగా, సందేష్‌ బురి మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నాగు గవర దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ ఎంటర్‌ ప్రైజెస్‌ సమర్పణలో ఏ స్టూడియో 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై జై వైష్ణవి కె నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల చిత్ర ట్రైలర్‌ని విడుదల చేయగా, దానికి అద్భుతమైన స్పందన వస్తోందని చెబుతుంది యూనిట్‌. 

దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ, `హైద‌రాబాద్‌లో 2000 ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా, కల్పిత పాత్రలతో రూపొందించిన చిత్రమిది. భార్య భర్తల మధ్య భావోద్వేగాలు సినిమాలో చాలా బావుంటాయి. అప్పట్లో చాలా మంది అమెరికా వెళ్లేవారు. వై2కె సమస్య కారణంగా ఓ కుటుంబంలో జరిగిన సంఘటన ఆధారంగా సినిమా రూపొందించాం. క్రైమ్ నేపథ్యంలో తీసిన ఫ్యామిలీ డ్రామా ఇది. అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి... ముగ్గురి పాత్రల మధ్య జరిగే సంఘర్షణ 'నాతిచరామి'. 

బలమైన సన్నివేశాలు, అర్థవంతమైన సంభాషణలు, అద్భుతమైన అభినయంతో సినిమా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సన్నివేశాలు ఉన్నాయి. 'నాతిచరామి' అనేది పెళ్లిలో భర్త చేసే ప్రమాణం. దానికి ఓ భర్త ఎంత కట్టుబడి ఉన్నాడనేది ఈ సినిమా కథ. ట్రైల‌ర్‌కు లభిస్తోన్న ఆదరణ సంతోషాన్నిచ్చింది. కొంత గ్యాప్‌తో పూనమ్‌ కౌర్‌ ఇందులో నటించడం ఆనందంగా ఉంది. ఆమె పాత్ర అలరిస్తుంది. మంచి కమ్‌ బ్యాక్‌ అవుతుంది` అని చెప్పారు. 

అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి, కవిత, మాధవి, జయశ్రీ రాచకొండ, కృష్ణ, సత్తన్న తదితరులు నటించిన ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎడిటర్: వినోద్ అద్వయ, లైన్ ప్రొడ్యూసర్: కె. మల్లిక్, సినిమాటోగ్రఫీ: మహి శేర్ల, స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్: ఎ స్టూడియో 24 ఫ్రేమ్స్, ప్రొడ్యూసర్: జై వైష్ణవి .కె, స్క్రీన్ ప్లే - దర్శకత్వం: నాగు గవర.

ఇదిలాఉంటే సినిమాలు లేకపోవడంతో పూనమ్‌ కౌర్‌ సామాజిక అంశాలపై, రాజకీయాలపై స్పందిస్తూ టాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌గా మారిపోతుంది. పవన్‌ కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తూ ఆమె అనేక వ్యాఖ్యలు చేస్తుంది. ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించే వారికి ఘాటుగా కౌంటర్లిస్తూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. `మా` ఎన్నికలు, టాలీవుడ్‌పై, సమంత విడాకులపై, జీఎస్టీపై ఇలా అనేక అంశాలపై బోల్డ్ గా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంది పూనమ్‌.