పవన్‌కి వీరాభిమానిగా, ఆయనంటే క్రష్‌గా చెప్పుకుంటూ ఆయనపై విమర్శలు చేసేవారికి కౌంటర్లిస్తూ మరింత అటెన్షన్‌ గ్రాస్ప్‌ చేస్తుంది పూనమ్‌. అందులో భాగంగా ఇప్పుడు మరోసారి ఆమె వార్తల్లో నిలిచింది. 

నటి పూనమ్‌ కౌర్‌(Poonam Kaur) సినిమాల్లో కనిపించకపోయినా వార్తల్లో నిలుస్తుంది. వివాదాస్పద అంశాలపై తనదైన స్టయిల్‌లో స్పందిస్తూ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతుంది. ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. అదే సమయంలో తనకు సినిమా ఛాన్స్ లు లేకపోవడంతో ఈ రూపంలో వార్తల్లో నిలించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే చాలా వరకు పూనమ్‌ తన పాపులారిటీ కోసం పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan)ని వాడుకుంటుండటం విశేషం. పవన్‌కి వీరాభిమానిగా, ఆయనంటే క్రష్‌గా చెప్పుకుంటూ ఆయనపై విమర్శలు చేసేవారికి కౌంటర్లిస్తూ మరింత అటెన్షన్‌ గ్రాస్ప్‌ చేస్తుంది పూనమ్‌. 

అందులో భాగంగా ఇప్పుడు మరోసారి ఆమె వార్తల్లో నిలిచింది. Pawan Kalyan.. రానాతో కలిసి నటించిన `భీమ్లా నాయక్`(Bheemla Nayak) చిత్రం శుక్రవారం విడుదలైంది. బెనిఫిట్‌ షోస్‌ పేరుతో రాత్రి నుంచి సందడి మొదలైంది. ఒక్కో టికెట్‌ రెండు వేలు పలికింది. అయినా అభిమానులు ఎంతైనా పెట్టి సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు థియేటర్‌లో `భీమ్లానాయక్‌` మోత మోగుతుంది. పాజిటివ్‌ టాక్‌ రావడంతో సినిమా రీ సౌండ్‌ మోగిస్తుందంటున్నారు అభిమానులు. 

ఈ నేపథ్యంలో Poonam Kaur చేసిన చాటింగ్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. తన ఫ్రెండ్‌తో చాటింగ్‌ చేసింది. ఇందులో ఆమె `అక్కా బావ(పవన్‌) సినిమాకెళ్లాను. సినిమా బాగుంది. సూపర్‌ హిట్‌ అంటూ చాటింగ్‌ చేసుకోవడం విశేషం. మడ్డీ పేరుతో ఉన్న అమ్మాయితో పూనమ్‌ చాట్‌ చేయడం విశేషం. ఇందులో ఆమె `సినిమాకి వచ్చాను అక్కా.. బావ సినిమా. మార్నింగ్‌ 8గంటలకు. బ్లాస్టింగ్‌` అని ఆమె చాట్‌ చేయగా, జెన్యూన్‌ రివ్యూ చెప్పు అని పూనమ్‌ అడిగింది. ఒకే అక్క అని చెప్పిన మడ్డీ, మధ్యాహ్నం సినిమా చూశాక మళ్లీ చాట్‌ చేసింది. అక్కా సినిమా హిట్‌. నన్ను నమ్ము. ప్రామిస్‌గా చెబుతున్నా` అని పేర్కొనడం విశేషం. 

Scroll to load tweet…

దీంతో ఇప్పుడిది నెట్టింట వైరల్‌ అవుతుంది. అయితే దీనిపై నెటిజన్లు పలు సెటైర్లు విసురుతున్నారు. అందరి అటెన్షన్‌ తిప్పుకోవడానికి పూనమ్‌ ఇలా చేస్తుందని సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే చాలా గ్యాప్‌ తర్వాత పూనమ్‌ కౌర్‌ తెలుగులో `నాతిచరామి` అనే చిత్రంలో నటిస్తుంది. అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి, కవిత, మాధవి, జయశ్రీ రాచకొండ, కృష్ణ, సత్తన్న తదితరులు నటించిన ఈ చిత్రానికి నాగు గవర దర్శకుడు. ఈ సినిమాకి ఎడిటర్: వినోద్ అద్వయ, లైన్ ప్రొడ్యూసర్: కె. మల్లిక్, సినిమాటోగ్రఫీ: మహి శేర్ల, స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్: ఎ స్టూడియో 24 ఫ్రేమ్స్, ప్రొడ్యూసర్: జై వైష్ణవి. ఇది విడుదలకు సిద్ధమవుతుంది.