కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ ల మధ్య కొన్ని నెలలపాటు సాగిన వర్డ్ వార్ లో భాగంగా క్రిటిక్ కత్తి మహేష్... హిరోయిన్ పూనమ్ కౌర్ పై  సంచలన ఆరోపణలు చేసి వివాదంలోకి లాగిన సంగతి తెలిసిందే. కత్తి మహేష్ ను ఫ్యాట్సో అంటూ ట్వీట్ చేసి పప్పులో కాలేసిన పూనమ్... వివాదంలో నాని నాని చల్లబడింది. అయితే పూనం కౌర్ మళ్ళి తన మాటలకు పదును పెంచింది.

 

తాజాగా తన కొత్త ట్వీట్లతో కొంత అయోమయానికి గురి చేసేలా సందేశం పెట్టడంతో ఇవి ఎవరి గురించా అని పవన్ ఫాన్స్ తో పాటు కత్తి మహేష్ మద్దతుదారులు కూడా ఆలోచనలో పడ్డారు. పూనం కౌర్ ట్వీట్ లో ఉన్న మెసేజ్ ఇది. “డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు మీ అస్తిత్వం ఏంటి? అవసరాల కోసం మారిపోయిన నిజాయితీ నీ గుణం ఏంటి?” ఇంతే ఆ కామెంట్ లో వున్నది. కేవలం ఈ రెండు లైన్లు మాత్రమే పోస్ట్ చేసిన పూనం కౌర్ తన కామెంట్లతో పెద్ద చర్చకే అవకాశం ఇచ్చింది. పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలకు స్వస్తి చెప్పి ప్రజా క్షేత్రంలోకి వెళ్ళిపోయిన సమయంలో ఇలా చెప్పడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. చివరి ఘట్టంలో కత్తి మహేష్ కు పవన్ ఫాన్స్ కు టీవీ ఛానల్స్ స్టూడియోలలో రాజీ కుదరడంతో ఆ వ్యవహరాన్ని ఉద్దేశించి పూనమ్ వ్యాఖ్యలు చేసిందా అనే విశ్లేషణ కుడా సాగింది.

అయితే ఇలా చర్చ సాగుతున్న సందర్భంలోనే మరో కొత్త మెసేజ్ లో ఇది ఏ వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదని ఓ 14 ఏళ్ళ అమ్మాయిని ఒక కసాయి తండ్రి అమ్మేస్తే తాను 24 ఏళ్ళకే 7 సంవత్సరాల బిడ్డకు తల్లిగా మారాల్సి వచ్చిందని విదేశాల్లో బాధితురాలిగా ఉన్న ఆ అమ్మాయి అక్కడ నుంచి తప్పించుకుని ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చి తన తల్లితో పాటు బిడ్డను కూడా చూసుకుంటోదని.. తన బలం స్పూర్తినివ్వడం వల్లే ఆ తండ్రిని ఉద్దేశించి మెసేజ్ పెట్టానని చెప్పింది. సదరు అమ్మాయి ఇప్పుడు ఫాషన్ డిజైనర్ అని కూడా చెప్పింది.

అయితే పూనమ్ వివరణ.. తన కామెంట్లకు సింక్ కాకపోవడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. ముందుగానే  ఆ అమ్మాయి పేరైనా కనీసం చెప్పి ఉంటే... ఇంత రచ్చ జరిగేది కాదని కొందరు పవన్ ఫాన్స్ అభిప్రాయ పడ్డారు. ఇలా క్లారిటీ లేకుండా చెప్పే బదులు పూర్తి వివరాలు ఆధారాలు కూడా చూపిస్తే బాగుండేది కదా అని కొందరు తనకు సమాధానంగా అందులో చెప్పారు.

 

ఇక టాపిక్ మరింత ముదరకముందే పద్మావత్, భాగమతి సినిమాల విజయాలను ఉదాహరిస్తూ ఇదే మహిళా శక్తి అని టాపిక్ ని ముగించే ప్రయత్నం చేసింది పూనమ్. మొత్తానికి పూనమ్ కూడా మహిళా శక్తి చాటేందుకు ఎప్పటికప్పుడు సంసిద్ధంగా వుంటానని తన కామెంట్లలో స్పష్టం చేస్తోంది.