పవన్ కళ్యాణ్ నిన్న టీడిపి మీద గాటుగానే స్పందించారు. ఆయన టీడిపికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు లోకేష్ పై చేసిన కామెంట్లు సోషల్ మీడయా మొత్తం చర్చ దీని గురించే. ఇప్పడు అసలు మ్యాటర్ ఏంటంటే పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అని పలు సందర్బాలలో చెప్పిన విషయం అందరికి తెలిసిందే. ఆమె ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ తను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చెక్కర్లుకొడుతోంది. అది ఏమిటంటే పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు వేస్తుందంటు ఇపుడు ఒక రచ్చ మొదలైంది.ఈ పోస్ట్ లో తను ఏమి చెప్పిందంటే కొంతమంది గేమ్స్ ఆడుతున్నారు. కాన్సెప్ట్ లు డైలాగులు కాపీ కొట్టి జనాలను అమాయకులను చేసి ఆడుకుంటున్నారంటు పోస్ట్ చేసింది. దీనిని చూస్తుంటే నిన్న పవన్ గుంటూరు సభలలో పవన్ స్పీచ్ కి తన కౌంటర్ వేస్తున్నట్టు అని అర్థమయ్యేల ఉన్నా మరి ఆ పోస్ట్ ఇప్పుడే ఎందుకు పోస్ట్ చేసిందో తనకే తెలియాలి. మరి ఇది తను పోస్ట్ చేయలేదని తను ఉమెన్స్ డే తర్వాత తన అకౌంట్ వాడటలేదని తన దగ్గర సన్నిహితులు చెప్తున్నారు.