టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది పూజా హెగ్డే. ఒక్కో సినిమాతో తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తోంది. ప్రస్తుతం మహేష్ బాబుతో 'మహర్షి' సినిమాలో నటిస్తోన్న ఈ భామ ప్రభాస్ తో కూడా ఓ సినిమా చేస్తోంది.

మొత్తానికి స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ బిజీ భామగా మారిన పూజాకి ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేని ఫైనల్ చేసుకున్నారు.

'అరవింద సమేత'లో పూజా నటన, ప్రొఫెషనలిజం త్రివిక్రమ్ కి బాగా నచ్చడంతో మరోసారి ఆమెని రిపీట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మరో ఆసక్తికర విషయమేమిటంటే.. అల్లు అర్జున్ కి కూడా ఇది పూజాతో రెండో సినిమా. గతంలో వీరిద్దరూ కలిసి 'డీజే' సినిమాలో నటించారు.

మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ, రష్మికల పేర్లు పరిశీలించారు. కానీ ఫైనల్ గా పూజాకి ఫిక్స్ అయ్యారు. ఈ నెలలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇది  పూర్తయిన తరువాత బన్నీ-సుకుమార్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుంది.