సినిమా ఇండస్ట్రీలో మన నటీమణులు అప్పుడప్పుడు తమ గొంతు సవరించుకొని పాటలు పాడడం చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్, నిత్యామీనన్, చిరంజీవి, అఖిల్ ఇలా చాలా మంది తారలు తమ సినిమాల్లో పాటలు పాడి మెప్పించారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి నటి పూజా హెగ్డే కూడా చేరబోతుంది.

తన కొత్త సినిమాలో పూజా స్వయంగా ఓ పాట పాడబోతుంది.అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది.

పాట విషయానికొస్తే.. చిన్నప్పటి నుండి పూజాకి మ్యూజిక్ అంటే ఆసక్తి. అప్పుడు గిటార్ ప్లే చేస్తూ పాటలు పాడుతుంటుంది. వాటిని సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. ఇప్పుడు ఏకంగా సినిమాలో పాట పాడే ఛాన్స్ కొట్టేసింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ మంచి ట్యూన్ కూడా సిద్ధం చేశాడట.

గతంలో పూజా కూడా తనకు సంగీతం అంటే ఇష్టమని, సినిమాల్లో పాడాలని ఆశగా ఉందని చెప్పింది. ఇప్పుడు ఆ అవకాశం త్రివిక్రమ్ సినిమా ద్వారా దొరికింది. మొత్తానికి పూజా సింగర్ గా తన టాలెంట్ నిరూపించుకోవడానికి సిద్ధమవుతోంది.