Asianet News TeluguAsianet News Telugu

పూజ పరిస్దితి మరీ ఇలా అయ్యిపోయిందేంటి..?

ఈ సినిమా తప్పించి ఆమె కొత్త సినిమాలు ఏమీ కమిటవ్వలేదు.  ఈ నేపధ్యంలో ఆమె కెరీర్ ఎలా ఉంటుంది..ఉండబోతోందనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.
 

Pooja Hegde struggling to bag new projects
Author
First Published Feb 4, 2023, 1:34 PM IST


ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన పూజ హెగ్డే  ఒక్క సారిగా కెరిర్ పరంగా వెనకపడుతుందని ఊహించి ఉండదు. వరస పెట్టి ఆచార్య, బీస్ట్, రాధేశ్యామ్, సర్కస్ సినిమాలు డిజాస్టర్ అవ్వటంతో ఆమెను ఎప్రోచ్ అయ్యేవాళ్లు తగ్గిపోయారు. చేతిలో ఇప్పుడు కేవలం మహేష్ బాబు సినిమా మాత్రమే ఉంది.  ‘SSMB28’ తొలి షెడ్యూల్‌ పూర్తయింది. ఈ నెలాఖరున కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇక పూజా హెగ్డే సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. ఈ సినిమా తప్పించి ఆమె కొత్త సినిమాలు ఏమీ కమిటవ్వలేదు.  ఈ నేపధ్యంలో ఆమె కెరీర్ ఎలా ఉంటుంది..ఉండబోతోందనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.

వాస్తవానికి ఇప్పుడు పూజ హెగ్డే కెరీర్ ..పూర్తిగా మహేష్, త్రివిక్రమ్ సినిమాపై ఆధారపడి ఉంది. ఆ సినిమా హిట్టై, ఆమె పాత్రకు పేరు వస్తే మళ్లీ బిజీ అయ్యిపోతుంది. తను కెరీర్ హిట్ ట్రాక్ లోకి రావటానికి ఇప్పుడు ఆమె త్రివిక్రమ్ మీదా, మహేష్ మీదా డిపెండ్ అయ్యింది. ఆ సినిమాలో ఆమె మహేష్ బాబు లవర్ గా కనిపించనుంది. ఇలా ఓ సినిమా హిట్ కొడితేనే తన కెరీర్ ముందుకు వెళ్ళాల్సిన పరిస్దితి వస్తుందని ఆమె ఊహించి ఉండరు. 

ఈ బ్యూటీ తెలుగులో దాదాపు అందరు టాప్‌ యంగ్‌ హీరోల సరసన చేసింది. పూజా హెగ్డే కెరీర్‌లో ది బెస్ట్‌ మూవీస్‌లో ‘అల వైకుంఠపురంలో’ ఒకటి అనే చెప్పాలి. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పూజాకు కూడా నటిగా మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్‌కు పూజాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.

బుట్ట బొమ్మ సాంగ్‌లో సిగ్నేచర్‌ స్టెప్‌ నెట్టింట బాగా వైరల్‌ అయ్యింది. అప్పటి నుంచి పూజాను బుట్ట బొమ్మ అని పిలవడం మొదలు పెట్టారు. అమూల్య పాత్రలో నటించి, సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇదిలా ఉంటే తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన ఈ సినిమాలాగే మహేష్ సినిమా కూడా నిలుస్తుందని ఆమె భావిస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios