తాజాగా రిలీజైన అరబిక్ కుత్తు లిరికల్ వీడియో అదిరిపోయింది. అరబిక్ స్టైల్లో సాంగ్ మొత్తం చాలా స్టైల్ గా ఉంది.   పూజా అందాల గురించి అస్సలు చెప్పక్కర్లేదు. విజయ్ కి తగ్గట్టు బుట్ట బొమ్మ తన అంద చందాలతో స్టన్నింగ్ లుక్ తో పిచ్చెక్కించేసింది. 

హాట్ బ్యూటీ పూజా హెగ్డే క్రేజ్ మామూలుగా లేదన్న సంగతి తెలిసిందే. వరుస ప్రాజెక్టుతో, బిజీ షెడ్యూల్స్‌తో సందడి చేస్తుంది. టాలీవుడ్, కోలీవుడ్ వయా బాలీవుడ్ అన్నట్లు తెగ రౌండ్స్ వేస్తోంది. నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ తో తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన పూజా .. ‘అరవింద సమేత’, ‘అల.. వైకుంఠపురములో’, ‘మహర్షి’ సినిమాలతో గోల్డెన్ లెగ్ హీరోయిన్‌గా మారిపోయింది. అక్కినేని అఖిల్ పక్కన చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాలు రిలీజ్‌ అయ్యి మంచి హిట్ అయ్యింది.

ప్రభాస్‌తో చేసిన ‘రాధే శ్యామ్’, ఆచార్య చిత్రాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. ‘హౌస్ ఫుల్ 4’ తర్వాత హిందీలో.. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న ‘సర్కస్’ మూవీలో నటిస్తోంది. దళపతి విజయ్ ‘బీస్ట్’ ఫిలింతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రతీ హీరోకు ఆమే కావాలనే పరిస్దితి ఏర్పడింది. ఇప్పుడు అరబిక్ కుత్తు సాంగ్ సూపర్ హిట్ అవ్వటంతో ఆమెకు వరస పెట్టి తమిళ స్టార్స్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఏ నిర్మాతను, హీరోను కాదనలేని పరిస్దితి.

అసలే బుట్ట బొమ్మ కు క్షణం తీరిక ఉండటం లేదు. కోవిడ్ ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ టైమ్ లో తప్ప ఆమె విశ్రాంతి తీసుకున్నది లేదు. గత కొంత కాలంగా వరుస షూటింగ్ లతో బిజీగా వున్న పూజా హెగ్డే ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి దాదాపు 13 ఏళ్ల విరామం తరువాత వెకేషన్ కి వెళ్లింది. రాధేశ్యామ్ ప్రమోషన్స్ కే డుమ్మా కొట్టే సిట్యువేషన్. తమిళంలోనూ ఆమె అడుగుపెట్టి మార్కెట్ సుస్దిర పరుచుకుందామనుకుంటోంది. నయనతార ని దాటేస్తుందని అక్కడ మీడియా అంటోంది. ఇప్పుడీ తమిళ కుత్తు ఎఫెక్ట్ ఆమె కెరీర్ పై బాగా ఉంటుందని భావిస్తున్నారు.

ఇక సౌత్ లో ఈ జనరేషన్ సూపర్‌ స్టాయి హీరోయిన్ ఎవరూ అంటే అందరూ నయనతార పేరే చెబుతారు. కమర్షియల్‌ సినిమాలంటే అంతగా ముందుకు రాకపోయినా… చేసిన సినిమాకు భారీ మొత్తంలోనే రెమ్యునేషన్ అందుకుంటూ ఉంటుంది. ఆమెకు పోటీగా చాలామంది హీరోయిన్స్ వచ్చినా… కథల ఎంపికలో ఆమె చేసే ఆలోచన మిగలిన వాళ్లు చేయక, లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేయక… పారితోషికంలో ఆమెనే టాప్‌గా నిలుస్తోంది.

 అయితే ఇన్నాళ్లకు నయన్‌కు పూజా హెగ్డే నుండి గట్టి పోటీ ఎదురవుతోంది. ఆమె ఇప్పుడు సౌత్ లో టాప్ ప్లేస్ కు చేరుకుంది. ఇప్పుడు పూజా హెగ్డే కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే… ₹3కోట్ల నుండి ₹4 కోట్లు వరకు డిమాండ్‌ చేస్తోందని టాక్‌. అయితే అంతకు మించి ఇవ్వటానికి సిద్దపడుతున్నారు నిర్మాతలు. ఆమె నటించిన రాధేశ్యామ్` తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఏక కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ మార్చి 11న విడుదల కాబోతోంది.