డీజేలో తన అందాల ఆరబోతతో తెలుగు కుర్రకారుకు కిక్కెక్కించిన బ్యూటీ పూజా హెగ్డే. అయితే తనకు ఎంత డబ్బు ఇచ్చారన్నది ముఖ్యం కాదని, బాధ్యతగా వున్నానా లేదా అనేదే ఎక్కువ ఆలోచిస్తానని అంటోంది డీజే బ్యూటీ. యాడ్స్ లో నటించే స్టార్స్ బాధ్యతారాహిత్యంతో వుండకూడదని అంటోంది. తాను మాత్రం అలాంటిది సహించేదాన్ని కాదంటోంది హీరోయిన్ 'పూజా హెగ్డే'.

 

ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఓ ప్రముఖ సంస్థ ప్రతినిధులు ఇటీవల పూజా హెగ్డేను కలిసి తమ 'వెయిట్ లాస్ ప్రొడక్ట్‌'ను ప్రమోట్ చేయాలని కోరారట. ఇందుకు భారీ పారితోషికం కూడా ఇస్తామని ఆఫర్ చేశారట. అయితే పూజా మాత్రం సున్నితంగా ఆ ఆఫర్ ను తిరస్కరించిందట.

 

డబ్బు కోసం తాను ఏది పడితే అది చేయనని పూజా హెగ్డే చెబుతోంది. ట్యాబ్లెట్స్ వాడటం వల్ల బరువు తగ్గుతారని మిస్ గైడ్ చేయడం తనకిష్టం లేదని అంటోంది. ఒక నటిగా తాను చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని పూజా ఈ రకంగా సభ్య సమాజానికి మెసేజ్ ఇస్తోంది.

 

రోజూ కనీసం 45నిమిషాలు వ్యాయామం చేయడం.. స్ట్రిక్ట్‌ డైట్, యోగతో లైఫ్‌స్టైల్‌ చేంజ్‌ చేసుకుంటే.. బరువు తగ్గడం పెద్ద విషయం కాదని, బరువు తగ్గడానికి సహజ పద్దతిని అనుసరించడమే అన్ని విధాలా మేలు అని చెబుతోంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సంగతి ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాలంటోంది పూజా హెగ్డే. మరి బ్యూటీ చెప్తోంది. అంతా హెల్దీగా వుండండి.