పూజా హెగ్డే గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తన అభిమానులు గత పది రోజులుగా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వారు ఊపిరి పీల్చుకునేలా చేసింది. మొత్తానికి తనకు నెగటివ్‌ వచ్చిందని ప్రకటించింది. ఈ విషయాన్ని పూజా హెగ్డే ట్వీట్‌ చేసింది. `మీ ప్రేమకి ధన్యవాదాలు. నేను కోలుకున్నాను. ఆరోగ్యం బాగుంది. స్టుపిడ్‌ కరోనా పోయింది. నాకు టెస్ట్ నెగటివ్‌గా వచ్చింది. మీ ప్రార్థనలు, వైద్యం చేసే శక్తి అంతా ఒక మ్యాజిక్‌ చేశాయి. ఎప్పటికీ మీకు కృతజ్ఞతతో ఉంటాను. అందరు సురక్షితంగా ఉండండి. మాస్క్ ధరించండి` అని తెలిపింది పూజా.

పూజా హెగ్డే తనకి ఏప్రిల్‌ 25న కరోనా సోకినట్టు తెలిపిన విషయం తెలిసిందే.  దీంతో తాను హోం క్వారంటైన్‌ అయ్యారు. ఇంట్లో నుంచే ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. పది రోజుల్లో తనకు వైరస్‌ తగ్గిపోయినట్టు తెలిపింది.  దీంతో పూజా అభిమానులు కాస్త రిలాక్స్ అయ్యారు. ఇక పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌తో `రాధేశ్యామ్‌`లో నటిస్తుంది. రామ్‌చరణ్‌తో `ఆచార్య` చిత్రంలో చిన్న రోల్‌ చేస్తుంది. దీంతోపాటు అఖిల్‌తో `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో నటిస్తుంది. ఈ మూడు సినిమాల్లోనూ తన పాత్రల షూటింగ్‌ని పూర్తి చేసుకుంది పూజా. తమిళంలో విజయ్‌ తో ఓ సినిమా చేస్తుంది. హిందీలో `సర్కస్‌` సినిమాలో నటిస్తుంది.