చిరంజీవి హీరోగా `ఆచార్య` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా, ఇందులో చిరు సరసన కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మరోవైపు రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన `సిద్ధ` అనే కామ్రేడ్‌ పాత్రలో నటించనున్నారు. సినిమాలో ఆయన పాత్ర షెడ్యూల్‌ పూర్తయ్యింది. శుక్రవారం తన షూటింగ్‌ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. తన భార్య ఉపాసనతో కలిసి వెనుతిరిగిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే ఇందులో చెర్రీకి కూడా జోడి ఉంటుందనే టాక్‌ వినిపించింది. రష్మిక మందన్నా పేరు ప్రధానంగా వినిపించింది. ఇటీవల పూజా హెగ్డేని ఫైనల్‌ చేసినట్టు సోషల్‌ మీడియాలో వార్తలు వినిపించాయి. కానీ దీనిపై చిత్ర బృందం ఎలాంటి ప్రకటన చేయలేదు. పూజాని సస్పెన్స్ లో పెట్టింది `ఆచార్య` టీమ్‌. కానీ పూజా మాత్రం రివీల్‌ చేసింది. తాజాగా `ఆచార్య`లో తన పాత్ర షూటింగ్‌ కూడా పూర్తయ్యిందట. రామ్‌చరణ్‌తోపాటే తన పార్ట్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఈసందర్భంగా షూటింగ్‌ లొకేషన్‌లో దిగిన ఫోటోలను పంచుకుంది పూజా. 

ఇందులో `జోక్‌ జోన్యూన్‌గా, ఫన్నీగా ఉన్నప్పుడు నవ్వుని ఎవ్వరు ఆపుకోలేర`ని చెప్పింది పూజా. అడవి ప్రాంతంలోని  ఇంట్లో దిగిన ఫోటోలని షేర్‌ చేసింది. ఇందులో నవ్వుతూ కనిపించింది పూజా. అయితే ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో మాత్రం అదేలొకేషన్‌లో తీసిన సెల్ఫీ వీడియోని పంచుకుంటూ `అందమైన ప్రదేశంలో ఆంద్రప్రదేశ్‌లో `ఆచార్య` షెడ్యూల్‌ పూర్తి చేశా` అని పేర్కొంది. దీంతో `ఆచార్య`లో రామ్‌చరణ్‌ సరసన ఆమె నటిస్తున్న విషయం చెప్పకనే చెప్పేసింది. చిత్ర బృందం దాచినా, తాను బయటపెట్టేసి షాక్‌ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ మారెడుమిల్లి అడవి ప్రాంతంలో జరుగుతుంది. పూజా హెగ్డే ప్రస్తుతం దీంతోపాటు ప్రభాస్‌తో `రాధేశ్యామ్‌`లో నటిస్తుంది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా ఆ సినిమా రూపొందుతుంది. జులై 30న విడుదల కానుంది. దీంతోపాటు అఖిల్‌తో `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో నటిస్తుంది.