Asianet News TeluguAsianet News Telugu

నితిన్‌కి షాకిచ్చిన పూజా.. అందుకే నో చెప్పిందా?

పూజా గోల్డెన్‌ లెగ్‌ని, లక్కీని వాడుకోవాలనుకున్నారు యంగ్‌ హీరో నితిన్‌. ఆయన ఇటీవల కొత్తజీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. షాలిని అనే ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకుని వివాహ జీవితంలోకి ఎంటరయ్యాడు. ప్రస్తుతం ఆ మ్యారేజ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్న నితిన్‌ కి పూజా హెగ్డే షాక్‌ ఇచ్చింది.

pooja hegde rejects nitin movie
Author
Hyderabad, First Published Aug 4, 2020, 10:15 AM IST

ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. క్రేజీ హీరోయిన్‌ కూడా. ఇటీవల ఆమె నటించిన `అల వైకుంఠపురములో` భారీ బ్లాక్‌ బస్టర్‌గా నిలవడమే అందుకు కారణం. అంతేకాదు ఆమె నటించిన సినిమాలు ఇటీవల వరుసగా విజయాలు సాధిస్తున్నాయి. దీంతో స్టార్‌ హీరోలకు లక్కీ హీరోయిన్‌ అయిపోయింది. ఇండస్ట్రీ మాత్రం ఆమెది గోల్డెన్‌ లెగ్‌ అంటున్నారు. 

 పూజా గోల్డెన్‌ లెగ్‌ని, లక్కీని వాడుకోవాలనుకున్నారు యంగ్‌ హీరో నితిన్‌. ఆయన ఇటీవల కొత్తజీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. షాలిని అనే ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకుని వివాహ జీవితంలోకి ఎంటరయ్యాడు. ప్రస్తుతం ఆ మ్యారేజ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్న నితిన్‌ కి పూజా హెగ్డే షాక్‌ ఇచ్చింది. ఆయనతో సినిమా చేయనని చెప్పేసింది. 

నితిన్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. `భీష్మ` హిట్‌తో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం `రంగ్‌ దే`, చంద్రశేఖర్‌ ఏలేటితో ఓ సినిమాతోపాటు మరో రెండు చిత్రాలకు కమిట్‌ అయ్యాడు. అందులో ఒకటి హిందీ సూపర్‌ హిట్‌ `అంధాదున్‌` రీమేక్‌. ఆయుష్మాన్‌ ఖురానా, రాధికా ఆప్టే జంటగా టబు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సాధించింది. తాజాగా దీన్ని నితిన్‌ హీరోగా రీమేక్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు. 

ఇందులో నటించే హీరోయిన్‌ కోసం అన్వేషన్‌ జరుగుతుంది. పూజా హెగ్డేని హీరోయిన్‌గా అనుకున్నారట. అయితే ఆమె నిర్మోహమాటంగా నో చెప్పిందట. అయితే ఆమె రిజెక్ట్ చేయడానికి కారణాలు అన్వేషిస్తే ప్రధానంగా రెండు వినిపిస్తున్నాయి. సినిమాలో హీరోయిన్‌ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు, నిడివి కూడా చాలా తక్కువే. అందుకే నో చెప్పిందంటున్నారు. దీంతోపాటు మరో కారణంగా కూడా వినిపిస్తుంది. పారితోషికం విషయంలో పూజా సాటిస్ఫై కాలేదట. దీంతో చేయలేనని చెప్పినట్టు టాక్‌. మరి ఇందులో నిజమేంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక దీనిపై నెటిజన్లు తమదైన స్టయిల్‌లో స్పందిస్తున్నారు. పెళ్ళైనందుకు నో చెబుతున్నావా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

ప్రస్తుతం పూజా.. ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న `రాధేశ్యామ్‌`, అఖిల్‌ హీరోగా తెరకెక్కుతున్న `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రాల్లో నటిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios