లైఫ్ అనేది ఎప్పుడు ఎక్కడ యూ టర్న్ తీసుకుంటుందో తెలియదు. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని అంటారు. ఓటమిలో ఉన్నప్పుడు గెంటేసిన వారే ఆ తరువాత విజయాల్ని చూసి కాళ్ల బేరానికి వస్తే.. ఆ కిక్కే వేరు. పూజా హెగ్డేకి కూడా ఇప్పుడు అలాంటి సీన్లే కనిపిస్తున్నాయి. 

ఒకప్పుడు అమ్మడు కోలీవుడ్ సినిమాతోనే సినీ కెరీర్ ను స్టార్ట్ చేసింది. 2012లో మూగమూడి అనే తమిళ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజా ఆ తరువాత మరో తమిళ్ సినిమాను చేయలేదు. ఆ తరువాత టాలీవుడ్ - బాలీవుడ్ లో వరుసగా ఫ్లాప్స్ వచ్చేసరికి కోలీవుడ్ లో వచ్చిన ఆఫర్స్ కూడా వెనక్కి వెళ్లిపోయాయి. 

కోలీవుడ్ లెక్క చేయని పరిస్థితుల్లో టాలీవుడ్ కి షిఫ్ట్ అయిన పూజకు మంచి ఆఫర్స్ దక్కాయి. బన్నీ - తారక్ - మహేష్ - ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసేసరికి కోలీవుడ్ నిర్మాతలు అమ్మడి తలుపు తడుతున్నారు. అవకాశాల కోసం వెళ్లినప్పుడు అప్పట్లో కుదరదని చెప్పినవారే ఇప్పుడు వెంటపడుతున్నారు. 

త్వరలో ఆమె సూర్య సినిమా ద్వారా చాలా కాలం అనంతరం తమిళ్ ఆడియెన్స్ కి కనిపించబోతోంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య సినిమాలో పూజాది చాలా కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. అలాగే మరో మూడు కోలీవుడ్ ఆఫర్స్ కూడా పూజ ఎకౌంట్ లో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే వాటిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.