పూజా హెగ్డే(Pooja Hegde) తన డ్రీమ్ ఇంటిని నిర్మించుకుంది. పర్సనల్ లైఫ్‌లో మరో ముందడుగు వేసింది. పూజా తన కొత్తింట్లోకి అడుగుపెట్టింది.
ఎవరికైనా సొంతిళ్లు అనేది ఓ డ్రీమ్. తమకు నచ్చినట్టుగా నిర్మించుకోవాలని కలలు కంటారు. ఆ డ్రీమ్ నెరవేరితే ఆ ఆనందమే వేరు. తాజాగా పూజా హెగ్డే(Pooja Hegde) తన డ్రీమ్ ఇంటిని నిర్మించుకుంది. పర్సనల్ లైఫ్‌లో మరో ముందడుగు వేసింది. పూజా తన కొత్తింట్లోకి అడుగుపెట్టింది. ముంబయిలో Pooja Hegde ఓ ఇంటిని నిర్మించుకుంది. తాజాగా శుక్రవారం తన కొత్తింట్లోకి గృహప్రవేశం చేసినట్టు పేర్కొంది. ఈ సందర్భంగా తాను పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
ఈ సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది పూజా. ఏడాది పాటు ఈ కొత్తింటి నిర్మాణం జరిగిందని, అన్ని కలలు నెరవేరినందుకు మిమ్మల్ని మీరు నమ్మండి, కష్టపడి పనిచేయండి అని పేర్కొంది. కష్టపడి పనిచేస్తే ఈ విశ్వం కచ్చితంగా మీ హృదయంతో ప్రేమలో పడుతుందని, మీ డ్రీమ్స్ పుల్‌ఫిల్ అవుతాయనే సందేశాన్నిచ్చింది. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు, ఆమె అభిమానులు పూజాకి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక తాను పూజాలో పాల్గొన్న ఫోటోని పంచుకోగా, అది వైరల్ అవుతుంది. ట్రెడిషనల్ లుక్‌లో పూజా అందం రెట్టింపు కాగా, ఆద్యంతంకట్టిపడేస్తుంది.
మరోవైపు ఇటీవల మాల్దీవులకు చెక్కేసిన పూజా హెగ్డే.. అక్కడ బిజీ లైఫ్ నుంచి రిలాక్స్ అయ్యింది. రెట్టింపు ఎనర్జీని పొందింది. అయితే సముద్రంలో జలకాలాడుతూ బికినీలో ఆమె ఫోటోలకు పోజులిస్తూ వాటిని సోషల్ మీడియాతో అభిమానులతో పంచుకోగా ఇంటర్నెట్‌లో దుమ్ము దుమారం కావడం విశేషం. నెటిజన్లని కట్టిపడేశాయి. బికినీలో తన అసలైన అందాలను చూపిస్తూ పూజా రెచ్చిపోయిందని చెప్పొచ్చు. ఇక వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది పూజా హెగ్డే. టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్‌గా రాణిస్తుంది. ఇటీవల వరుసగా `అరవింద సమేత`, `మహర్షి`, `అల వైకుంఠపురములో`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` చిత్రాల విజయాలతో దూసుకుపోతుంది పూజా హెగ్డే.
ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో ఫస్ట్ టైమ్ `రాధేశ్యామ్` చిత్రంలో నటిస్తుంది. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. సంక్రాంతి విడుదలకావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. సమ్మర్‌లో విడుదలకు సిద్ధమవుతుంది. మరోవైపు `ఆచార్య`లో కీలక పాత్ర పోషించింది. రామ్‌చరణ్‌తో కలిసి నటించింది. ఇది కూడా వాయిదా పడింది. ఏప్రిల్ 1న విడుదల కాబోతుంది. దీంతోపాటు పూజా ప్రస్తుతం మహేష్‌తో త్రివిక్రమ్ చిత్రంలో నటించబోతుంది. అలాగే పవన్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న `భవదీయుడు భగత్ సింగ్`తోపాటు బన్నీతో మరో సినిమా చేయబోతుందని సమాచారం.
